గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి

Published Wed, Mar 19 2025 12:56 AM | Last Updated on Wed, Mar 19 2025 12:52 AM

కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురంటౌన్‌: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులతో మంగళవారం మాట్లాడారు. 2029 నాటికి అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే లక్ష్యమన్నారు. పీఎంఏవై 1.0లో మంజూరైన ఇళ్లు, వివిధ దశల్లో నిర్మాణం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్‌ విలువ ఆధారంగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఎస్సీలు, బీసీలకు రూ. 50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలకు రూ.73.09 కోట్ల మేర అదనపు సాయం అందనుందన్నారు. 10,717 గృహాలు పూర్తి చేసేందుకు ఇది చక్కటి అవకాశంగా పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం గృహ నిర్మా ణ దినోత్సవంగా పాటించి ఇచ్చిన లక్ష్యాలు సాధించాలన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు

ఒంటిపూట బడులు

విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు ఇన్‌చార్జి ఐసీడీఎస్‌ పీడీ జి.ప్రసన్న తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు.

ఇల్లు చిన్నది... బిల్లు పెద్దది

రాజాం: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన నక్క లక్ష్మీనారాయణ తన కుమారుడి ఇంటిపై చిన్న గదిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఒక ఫ్యాను, రెండు లైట్లు, టీవీ మాత్రమే వినియోగిస్తున్నారు. కోడలు పద్మ పేరుతో ఉన్న విద్యుత్‌ కనెక్షన్‌కు ఫిబ్రవరి నెల విద్యుత్‌ బిల్లు రూ.1495.99 రావడంతో లబోదిబోమంటున్నారు. రూ.122 విలువ చేసే విద్యుత్‌ వినియోగిస్తే బిల్లు మాత్రం వేలల్లో వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని, న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

హెచ్‌ఎంపై చర్యలు తీసుకోండి

వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ శివారు మారిక గ్రామ ప్రాథమిక పాఠశాలకు వెళ్లకుండా జీతం తీసుకుంటున్న ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్‌ డిమాండ్‌ చేశారు. నెలలో నాలుగురోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లి జీతం తీసుకుంటున్నారని, బోధించేవారు లేక మారికలో 28 మంది, పాతమారికలో 14, కొత్తమారికలో 14 మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారన్నారు. హెచ్‌ఎం పనితీరుకు నిరసనగా పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి మంగళవారం ఆందోళన చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందించాలని కోరారు. కార్యక్రమంలో కె.ఆనంద్‌, బాబూరావు, అప్పలనాయుడు, రామకృష్ణ, ఆసు, తదితరులు పాల్గొన్నారు.

విచారణ వేగవంతం చేయండి

● శాసనసభ కమిటీ చైర్మన్‌ నెహ్రూకు

పాల రైతుల సంఘం నాయకుల వినతి

విజయనగరం ఫోర్ట్‌: విశాఖ డెయిరీపై విచారణను వేగవంతం చేయాలని పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు డిమాండ్‌ చేశారు. కుంచనపల్లిలోని గెస్ట్‌ హౌస్‌లో శాసనసభ కమిటీ చైర్మన్‌ జ్యోతుల నోహ్రూను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. తగ్గించిన పాల ధరను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో పాలరైతు సంఘం కార్యదర్శి కె.అజయ్‌కుమార్‌, డి సుబ్బారావు, తమటాపు పైడినాయుడు ఉన్నారు.

గృహనిర్మాణాలు   వేగవంతం చేయాలి 1
1/2

గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి

గృహనిర్మాణాలు   వేగవంతం చేయాలి 2
2/2

గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement