
భరోసా కరువు
బతుకు బండికి..
పార్వతీపురం టౌన్:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అటకెక్కించింది. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఉసూరుమనిపిస్తోంది. అదే కోవలో బతుకుబండికి భరోసా లేకుండా చేసింది. ఆటో, మ్యాక్సీక్యాబ్‌లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు నిరాసే మిగిలింది. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో వాహన మిత్ర పథకం కింట ఏటా రూ.10వేలు క్రమం తప్పకుండా ఆర్థిక సాయం చేసేవారు. ఈ మొత్తం వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, చిన్నపాటి మరమ్మతులకు ఉపయోగపడేది. నేడు కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పథకం అమలు చేయకపోవడంతో డ్రైవర్లపైనే ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు తనిఖీల పేరుతో అధికమొత్తంలో రుసుములు విధిస్తుండడంతో రోడ్లపై వాహనాలు నడపాలంటేనే హడలిపోతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఆటో, మ్యాక్సీక్యాబ్ వాహనాలు నడుపు తూ 4,564 మంది తమ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం చిన్నచూపుతో వాహనాలను నడపలేని దుస్థితి నెలకొందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కనీస అపరాధ రుసుం రూ. 130 ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.1050 పెంచిందని ఆరోపిస్తున్నారు. సంపాదించిన మొత్తం అపరాధ రుసుం రూపంలో ప్రభుత్వం దోచేస్తోందని మండి పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే వీటిపై చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
వాహన మిత్ర లేదు...చలానాల మోత తప్పడం లేదు
ఆటో, మ్యాక్సీ క్యాబ్‌ల డ్రైవర్ల ఆవేదన
గతంలో ఏటా రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం
నేడు వాహన మిత్ర ఆర్థిక సాయం ఊసెత్తని కూటమి
రోడ్డెక్కాలంటే భయం
జిల్లాలో 4,564 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు
ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ చెల్లించలేక
ఆర్థిక ఇబ్బందులు