బొబ్బిలి: పట్టణంలోని నాయుడు కాలనీలో గల ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రిటైర్డ్ హెచ్‌ఎం వై.శ్యామ్‌సుందర్(80) రెండో అంతస్తు నుంచి పడిపోయి మంగళవారం మృతిచెందారు. బాడంగి మండలం పాల్తేరులో హెచ్‌ఎంగా రిటైరైన ఆయన బొబ్బిలిలోని ప్రముఖ వైద్యుడు, ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వై.విజయమోహన్ తండ్రి. మంగళవారం మేడపై ఉన్న ఆయన ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందికి పడిపోయినట్లు, ఆల్జీమర్స్‌తో కొద్దికాలంగా బాధపడుతున్నట్లు కోడలు గ్రేస్‌కుమారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని ఎస్సై ఆర్.రమేష్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్సై చెప్పారు.
అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ హెచ్‌ఎం మృతి