
మాదకద్రవ్యాల రవాణాపై డ్రోన్‌లతో నిఘా‘
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురంటౌన్: జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాల నియంత్రణకు డ్రోన్‌లతో నిఘా పెట్టామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పోలీస్ అధికారులకు సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. సారా తయారీని పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. అసైన్డ్ భూముల్లో ఎవరైనా సారా తయారుచేస్తే వారి భూ పట్టాలు రద్దుచేస్తామని హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, ఎకై ్సజ్ శాఖ పనితీరు మెరుగుపడాలన్నారు. అటవీ ప్రాంతాల్లో సారా తయారీ, అమ్మకాలు జరగకుండా పర్యవేక్షణ జరగాలని అటవీశాఖ అధికారి ప్రసూన తెలిపారు. ఎస్పీ ఎస్.వీ.మాధవ్ రెడ్డి మాట్లాడుతూ గత నెల జిల్లాలో 288 కిలోల గంజాయి స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. 394 పాఠశాలలు, కళాశాలలో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతిరోజూ డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
నిరంతర నిఘా
జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి బి.ఆశ మాట్లా డుతూ పార్వతీపురం పట్టణంలో 4 మందుల దుకాణాలపై దాడులు నిర్వహించామని, 3 దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడాన్ని గుర్తించామని, వాటిలైసెన్సులు రద్దు చేస్తామన్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనాథుడు మాట్లాడుతూ 168 గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని, 74 గ్రామాల్లో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటుచేసినట్టు వివరించారు. అనంతరం ఈగల్ టీమ్ అవగాహన కార్యక్రమాల పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించా రు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, ఎస్‌డీసీ సి.రామచంద్రా రెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎ.రాంబాబు పాల్గొన్నారు.