వినాయక విగ్రహాలకు జియోట్యాగింగ్‌ పూర్తి | - | Sakshi
Sakshi News home page

వినాయక విగ్రహాలకు జియోట్యాగింగ్‌ పూర్తి

Sep 11 2024 12:04 AM | Updated on Sep 11 2024 12:04 AM

వినాయక విగ్రహాలకు జియోట్యాగింగ్‌ పూర్తి

వినాయక విగ్రహాలకు జియోట్యాగింగ్‌ పూర్తి

● రామగుండం పోలీసు కమిషనర్‌ శ్రీనివాస్‌ ● నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

గోదావరిఖని: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో వినాయక విగ్రహాల జియో ట్యాగింగ్‌ పూర్తిచేసినట్లు సీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జియోట్యాగింగ్‌ ద్వారా విగ్రహాల మరింత భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కమిషనరేట్‌లోని పెద్దపల్లి జిల్లాలో 2,405, మంచిర్యాల జిల్లాలో 2,251 విగ్రహాలకు ఆన్‌లైన్‌లో అనుమతి మంజూరు చేశామని పేర్కొన్నారు. మండప నిర్వాహకుల పూర్తిసమాచారాన్ని వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా క్షేత్రస్థాయిలో జియోట్యాగింగ్‌కు అనుసంధానం చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మండపాల వద్ద ఎలాంటి సెక్యూరిటీ సమస్య వచ్చినా అప్లికేషన్‌లోని లోకేషన్‌ ఆప్షన్‌ను నొక్కగానే వెంటనే మండపం ఏర్పాటు చేసిన ప్రాంతం పోలీసు శాఖకు తెలుస్తుందన్నారు. దీనిద్వారా క్షణాల్లో అక్కడకు చేరుకునేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement