మూడు నెలల శ్రమ వృథా!
● అనుభవ, బాధ్యతా రాహిత్యమా? ● సీనియర్లు లేకపోవడమా? ● పతకాలు లేకుండానే సింగరేణి ● కొలంబియా పోటీల్లో తీవ్ర నిరాశ ● రెస్క్యూ టీం ఇంటిదారి ● అధికారుల్లో మొదలైన అంతర్మథనం
గోదావరిఖని(రామగుండం): అనుభవ రాహిత్యమా.. ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ లేకపోవడమా, ముందుచూపు కొరవడటమా.. ఇలా కారణం ఏదైనా అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు చతికిలపడింది. ఈ పోటీల కోసం మూడునెలల పాటు చేసిన కసరత్తు వృథాగా పోయింది. రెస్క్యూ బ్రిగేడియర్లు 45రోజుల పాటు చేసిన శ్రమంతా వృథాగా అయ్యింది. మనదేశం నుంచి మూడుజట్లు హాజరయ్యాయి. ఇందులో కోలిండియాకు చెందిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఓవరాల్ రెండోస్థానం సాధించింది. హిందూస్తాన్ జింక్ మహిళా జట్టు కూడా రెండో స్థానం సాధించి అంతర్జాతీయ పోటీల్లో మువ్వన్నెల జెండా ఎగురవేసింది. 13వ అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీలు(ఐఎంఆర్‌సీ) కొలంబియా దేశంలో ఈనెల 15 నుంచి ఈనెల 20వ తేదీ వరకు జరిగాయి. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఐఎంఆర్‌సీ పోటీల్లో సింగరేణి రెండు దశాబ్దాలుగా హాజరవుతూ వస్తోంది. ఆలిండియా పోటీల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించినా.. అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చూపకలేకపోయింది.
పెద్దదేశాలు లేకున్నా పట్టు సాధించలే..
కొలంబియాలో అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీలకు పెద్దదేశాలు దూరంగా ఉన్నాయి. వాస్తవానికి 22దేశాలు పాల్గొనాల్సి ఉన్నా.. చిన్నదేశం కావడంతో అమెరికా, సౌత్‌ఆఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా జట్లు పోటీలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశేష అనుభవం ఉన్న సింగరేణి జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలుస్తుందని భావించారు. కానీ నిరాశే మిగిలింది.
అధికారుల్లో అంతర్మథనం
కొలంబియాలో జరిగిన అంతర్జాతీయ రెస్క్యూ పో టీల్లో సింగరేణి జట్టు చలికిలబడడంపై అధికారులు అంతర్మథనంలో పడిపోయినట్లు సమాచారం. అంతర్జాతీయ పోటీల్లో విశేష అనుభవం ఉన్న అధికారులతోపాటు టీం సభ్యులకు ఈసారి చోటివ్వకపోవడం కూడా ఓటమికి కారణమని భావిస్తున్నారు. ప్రధానంగా జట్టులో 60శాతం సభ్యులు అనువజ్ఞు లు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదంటున్నారు. అంతేకాకుండా సమన్వయం కోసం మరో ఇద్దరు లేదా ముగ్గురు అధికారులు వెళ్తే బాగుండేది అంటున్నారు. ఆరేళ్ల క్రితం నుంచి అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో పాల్గొంటున్న వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్(డబ్ల్యూసీఎల్) జట్టు ఓవరాల్ రెండోస్థానం సాధించి జాతీయ జెండాను అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసి దేశగౌరవాన్ని నిలబెట్టింది.
కొలంబియా పోటీల్లో పతకాలు సాధించిన దేశాలు
పాల్గొన్న జట్లు(పురుషులు) 18
బహుమతి దేశం
ఓవరాల్ ఫస్ట్ కెనడా
ఓవరాల్ సెకండ్ కోలిండియా
ఓవరాల్ థర్డ్ కొలండియా
మహిళా విభాగం 3
ఓవరాల్ ఫస్ట్ కొలంబియా
ఓవరాల్ సెకండ్ హిందూస్తాన్ జింక్
ఓవరాల్ థర్డ్ కెనడా
ఫస్ట్ ఎయిడ్
ప్రథమ కొలంబియా
ద్వితీయ కోలిండియా
తృతీయ కెనడా
ఎక్విప్‌మెంట్ మెకానిక్
ప్రథమ చైనా
ద్వితీయ కొలండియా
తృతీయ కొలంబియా
18ఏళ్లుగా రెండేళ్లకోసారి జరిగే అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో పాల్గొంటున్న సింగరేణి జట్టు ఈసారి ఉత్త చేతుల్తోనే వెనుతిరిగింది.
నాలుగేళ్ల క్రితం బరిలో దిగిన కోలిండియా జట్టు ఓవరాల్ రెండో చాంపియన్‌గా నిలిచింది.
తొలిసా హాజరైన హిందూస్తాన్ జింక్(హెచ్‌జెడ్‌ఎల్) మహిళా జట్టు బహుమతి సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment