కలెక్టర్‌ను కలిసిన డీసీపీ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన డీసీపీ

Mar 13 2025 12:06 AM | Updated on Mar 13 2025 12:06 AM

కలెక్టర్‌ను కలిసిన డీసీపీ

కలెక్టర్‌ను కలిసిన డీసీపీ

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి డీసీపీగా నియమితులైన కరుణాకర్‌.. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాక బుధవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లో ఆయనకు పూలమొక్క అందజేశారు.

సాఫీగా తాగునీటి సరఫరా

ముత్తారం/కాల్వశ్రీరాంపూర్‌: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. ముత్తారం మండలం మైదంబండ, పారుపల్లి, శాత్రజ్‌పల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం జాఫర్‌ఖాన్‌పేట, ఇదులాపూర్‌లో నీటివనరులను ఆయన బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేసవిలో నీటి కొరత ఉంటుందని, దీనిని అధిగమించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయ న అన్నారు. పారిశుధ్యం, ఆస్తిపన్ను వసూలు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.

పల్లెల్లో పారిశుధ్య పనులు

పెద్దపల్లిరూరల్‌/మంథని: వివిధ గ్రామాల్లో బుధవారం ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టా రు. ఈనెల 14వ తేదీ వరకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించడంతో జిల్లావ్యాప్తంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్దకల్వల గ్రామంలో చేపట్టిన పనులను డీఎల్‌పీవో వేణుగోపాల్‌ పర్యవేక్షించారు. నర్సరీని సందర్శించారు. పంచాయతీ కార్యదర్శి నిశాంత్‌రా వు తదితరులు ఉన్నారు.. మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో చేపట్టిన పనులను డీఎల్‌పీవో సతీశ్‌ కుమార్‌ పరిశీలించారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

మంథని: ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. వెలుగు రేఖా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. అనంతరం మహిళా కళాకారుల డప్పు ప్రదర్శనను తిలకించారు. నాబార్డ్‌ డీడీఏం జయప్రకాశ్‌, వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అంజని, ఏపీఏం పద్మ, సీఈవో రజిత, న్యాయవాదులు షబానా, శ్రీలక్మి, ఉపాధ్యాయురాలు బొజ్జ స్వాతి, ఏఎన్‌ ఏం కవిత, కానిస్టేబుళ్లు స్రవంతి, సంధ్య పాల్గొన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగావకాశాలు

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారం, కార్పొరేట్‌ ఆఫీస్‌, నోయిడో కార్పొరేట్‌ కార్యాలయంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నతాధికా రులు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశా రు. కెమికల్‌ విభాగంలో–9, మెకానికల్‌లో–6, ఎలక్ట్రికల్‌లో–3, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో –2, మె టీరియల్స్‌లో–3, ఫైనాన్స్‌ అకౌంట్స్‌లో–1, సి విల్స్‌లో–4, మెడికల్‌లో–5, సేఫ్టీలో–3, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీలో–4 ఖాళీలు ఉన్నా యి. ఏప్రిల్‌ 10 వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖా స్తు చేసుకోవాలి. వివరాలకు (https://www. rfcl.co.in) వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలకు బుధవారం 97.8శాతం మంది హాజరయ్యారని నోడల్‌ అధికారి కల్పన తెలిపారు. ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. మొత్తం 5,107 మందికి 4,995 మంది పరీక్షకు హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement