చెత్తను కాల్చడం నేరం | - | Sakshi
Sakshi News home page

చెత్తను కాల్చడం నేరం

Nov 23 2025 6:19 AM | Updated on Nov 23 2025 6:19 AM

చెత్త

చెత్తను కాల్చడం నేరం

కోల్‌సిటీ(రామగుండం): చెత్తను కాల్చడం నే రమని రామగుండం కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ అన్నారు. చెత్తను కాల్చడంతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి జిల్లా నేషనల్‌ గ్రీన్‌క్రాప్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను శనివారం బల్దియా కమిషనర్‌ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. చెత్తను కాల్చితే రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని ఆమె హెచ్చరించారు. నేషనల్‌ గ్రీన్‌కార్ప్స్‌ కో ఆర్డినేటర్‌, తెలంగాణ పర్యావరణ విద్య బ్రాండ్‌ అంబాసిడర్‌ గూళ్ల అంజన్‌కుమార్‌, బల్దియా ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ మధుకర్‌ పాల్గొన్నారు.

కొనుగోళ్లలో వేగం పెంచాలి

జూలపల్లి(పెద్దపల్లి): ధాన్యం కొనుగోళ్లలో వే గం పెంచి రైతులకు ఇబ్బందులు కలుకుండా చూడాలని అడిషనల్‌ కలెక్టర్‌ వేణు ఆదేశించా రు. స్థానిక మార్కెట్‌ యార్డులోని ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోళ్ల తీరుపై నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తూ కం వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. తహసీల్దార్‌ స్వర్ణ, ఆర్‌ఐ భవానీప్రసాద్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కొమ్మ పోచాలు తదితరులు పాల్గొన్నారు.

బీ థర్మల్‌ ఇంజినీర్ల బదిలీ

రామగుండం: మూతపడిన బీ–థర్మల్‌ ప్రాజెక్టులోని 26 మంది ఇంజినీర్లను యాదాద్రి విద్యుత్‌ కేంద్రానికి బదిలీ చేస్తూ శనివారం విద్యుత్‌సౌధ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. డివిజనల్‌ ఇంజినీర్లను ఇక్కడే కొనసాగిస్తారు. ఏడీఈలు నలుగురు, ఏఈలు 16 మంది, సబ్‌ ఇంజినీర్లు ఆరుగురు బదిలీపై వెళ్లనున్నారు.

26 నుంచి సదరం శిబిరాలు

పెద్దపల్లి: దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ కోసం గోదావరిఖని గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో ప్రతీనెల సదరం శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని తెలిపారు. ఈనేపథ్యంలో ఈనెలకు సంబంధించి 21 కేటగిరీల దివ్యాంగుల కోసం ఈనెల 26 నుంచి శిబిరాలు నిర్వహిస్తామన్నారు. 26న శారీరక, 28న చెవిటి, 29న దృష్టి వైకల్యం కలిగిన వారి కోసం క్యాంపులు నిర్వహిస్తామన్నారు. దివ్యాంగులు నిర్దేశిత తేదీల్లో మీసేవలో స్లాట్‌బుక్‌ చేసుకొని శిబిరాలకు హాజరు కావాలని ఆమె సూచించారు.

5లోగా దరఖాస్తు చేయాలి

పెద్దపల్లి: డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ తదితర సాంకేతిక కోర్సుల్లో సర్టిఫికెట్ల కోసం నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబరు 5వ తేదీలోగా దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏడో తరగతి ఉత్తీర్ణులై, ఆయా అంశాల్లో శిక్షణ పొందిఉన్న వారు అర్హులన్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారీచేస్తారన్నారు. ఆసక్తిగలవారు www. bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, హార్డ్‌కాపీలను జిల్లా విద్యాశాఖ అధి కారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.

కన్నాల రైల్వేగేట్‌ మూసివేత

పాలకుర్తి(రామగుండం): కన్నాల పంచాయతీ పరిధి బోడగుట్టపల్లి గ్రామ శివారులోని రైల్వేగేట్‌ను వారం రోజులపాటు మూసివేసిఉంచుతా మని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం తెలిపారు. రైల్వేట్రాక్‌పై 46 లెవల్‌ క్రాసింగ్‌ నంబర్‌, 282 కి.మీ. రాయి వద్ద అత్యవసర మరమ్మతులు చేపట్టామని, దీనిదృష్ట్యా ఈనెల 23 నుంచి 29వ తేదీ సాయంత్రం 6గంటల వరకు రైల్వేగేట్‌ను మూసిఉంచుతామన్నారు. వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మా ర్గాలు ఎంచుకుని సహకరించాలని కోరారు.

నేడు రిటైర్డ్‌ ఉద్యోగుల సమావేశం

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ రిరైర్డ్‌ ఉ ద్యోగుల సమావేశం ఆదివారం నిర్వహించనున్నట్లు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆకుల రాంకిషన్‌, ప్రధాన కార్యదర్శి ముత్యాలు శనివారం తెలిపారు. కృష్ణానగర్‌లో సమావేశం నిర్వహించనున్నామన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు యూనియన్‌లో స భ్యత్వం తీసుకోవాలని, పాత సభ్యులు పునరుద్ధరించుకోవాలని సూచించారు. సమావేశంలో పలు సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను రూపొందిస్తామని వారు వివరించారు.

చెత్తను కాల్చడం నేరం 1
1/2

చెత్తను కాల్చడం నేరం

చెత్తను కాల్చడం నేరం 2
2/2

చెత్తను కాల్చడం నేరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement