ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ప్రదర్శన
గోదావరిఖని: బూటకపు ఎన్‌కౌంటర్‌లను ఖండి స్తూ శనివారం స్థానిక పైలాన్ వద్ద ఐఎఫ్‌టీయూ నా యకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డు లు పట్టుకుని ఎన్‌కౌంటర్లపై నిరసన తెలిపారు. ఏ జెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరిట ఆ దివాసీలకు అండగా ఉన్న మావోయిస్టు పార్టీ నా యకులు, సానుభూతిపరులను బూటకపు ఎకౌంటర్లలో కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. మారణకాండను ఆపివేసి మావోయిస్టులతో వెంటనే శాంతిచర్చలు జరుపాలని వారు డిమాండ్ చేశారు. మా వోయిస్టు ముఖ్య నాయకులు పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం జరుగుతోందని, వారిని కోర్టు లో హాజరు పర్చాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు ఐ.కృష్ణ, బి.అశోక్, చిలుక శంకర్, ఐ.రాజేశం, మేరుగు చంద్రయ్య, ఎం.దుర్గయ్య, పైడిపల్లి రమేశ్, ఎం.కొమరయ్య, గుండు రాజ య్య, దుర్గం పోచం, రాయపోచం, ప్రేమ్‌కుమార్, కాంపెల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


