పొలాలు ఇక పడావే
చెక్‌డ్యాంతో ఏటా రెండు పంటలకు సాగునీరు అందే ది. పేల్చివేతతో అందులో చుక్కనీరు లేదు. పొలాలు అన్నీ పడావుగా మారుతాయి. యాసంగి పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమైన ఈ తరుణంలో చెక్‌డ్యాం పేల్చివేయడం బాధాకరం.
– సర్వ రమేశ్, రైతు, గుంపుల
ఎడారిని తలపిస్తున్న మానేరు
చెక్‌డ్యాం పేల్చివేతతో నీళ్ల న్నీ కిందికిపోయినయి. మానేరు వాగు ఎడారిని తలపిస్తున్నది. ప్రస్తుతం పంటలు వేయాలంటే పాతరోజులు గుర్తుకు వస్తున్నయి. ఈసారి బోర్లు వేసుకున్నవారే పంట వేసే అవకాశం ఉంది.
– గాదం సంపత్, రైతు, గుంపుల
చర్యలు తీసుకోవాలి
మానేరు నుంచి ఇసుక తరలించే వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం మానేరులో నీటిచుక్క లేదు. వ్యవసాయ బావుల్లో నీళ్లు ఉండవు. పంటలను ఎట్లా పండించాలో అర్థం కావడంలేదు.
– సర్వ సంపత్, రైతు, గుంపుల
పొలాలు ఇక పడావే
పొలాలు ఇక పడావే


