సిటీలా మారుతోంది
కరీంనగర్–సిరిసిల్ల ఫోర్‌లేన్ మార్గంలో ఉన్న మా పల్లె.. పట్టణంలా మారుతోంది. గతంలో రోడ్డు సైడ్ కొన్ని ఇండ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అందమైన భవనాలతో సిటీలాగా కనిపిస్తోంది. చాలా మంది రోడ్ వైపునకు వచ్చి స్థలం కొని.. ఇండ్లు నిర్మించుకుంటున్నారు.
– ఇరువాల మహేందర్, వెంకట్రావుపల్లి
భూముల ధరలకు రెక్కలు
వెంకట్రావుపల్లి గ్రామం కరీంనగర్–సిరిసిల్ల ఫోర్‌లేన్ రోడ్డుకు ఆనుకుని ఉంది. పలు వ్యాపారాలతో ఊరికి ప్రత్యేకత వచ్చింది. రోడ్‌సైడ్ చేసే వ్యాపారాలు ఊపందుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భూముల ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎకరాకు రూ.5 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.కోటికిపైగా పలుకుతోంది. – బూర్గుల నందయ్య,
మాజీ సర్పంచ్, వెంకట్రావుపల్లి
సిటీలా మారుతోంది


