సిరిసిల్లలో ఏకై క మహిళా ఎస్సై వినీతారెడ్డి
సిరిసిల్లక్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్‌శాఖలో పనిచేస్తున్న ఏకై క మహిళా ఎస్సై కొత్త వినీతారెడ్డి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన సత్యనారాయణరెడ్డి, వనజ దంపతుల చిన్న కుమార్తె. చిన్ననాటి నుంచే ‘పోలీసు అయితే బాగుంటుంది’ అని నాన్న చెప్పిన మాటలు, సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఆమెను పోలీస్ ఉద్యోగం దిశగా నడిపించాయి. కోఠి ఉమెన్స్ కాలేజీలో చదువుతున్న సమయంలో ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పొందడం ఆమెలో యూనిఫాం సేవపై మరింత ఆసక్తిని పెంచింది. స్వయంగా ప్రాక్టీస్, క్రమశిక్షణతో ఫిజికల్ ఈవెంట్స్‌కు సిద్ధమై మొదటి ప్రయత్నంలోనే 2024 బ్యాచ్‌లో ఎస్సై ఉద్యోగం సాధించారు. వినీతా జీవిత భాగస్వామి కూడా పోలీసే. ఎస్సై రాహుల్‌రెడ్డి ఆమెకు బంధువే. పెద్దలు నిర్ణయించిన పెళ్లి. ‘పెళ్లి తర్వాత టైమ్ సర్దుబాటు, పండుగలకు వెళ్లడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ ఇప్పుడిప్పుడే అవన్నీ సమన్వయించుకుంటున్నాం’ అని ఆమె తెలిపారు.


