పదకొండేళ్లుగా అలవాటైంది.. | - | Sakshi
Sakshi News home page

పదకొండేళ్లుగా అలవాటైంది..

Nov 23 2025 8:49 AM | Updated on Nov 23 2025 8:49 AM

పదకొండేళ్లుగా అలవాటైంది..

పదకొండేళ్లుగా అలవాటైంది..

సిరిసిల్లటౌన్‌: మాది ముస్తాబాద్‌ మండలం అవునూరు. నాకు పదిహేడేళ్ల క్రితం పెళ్‌లైంది. ఇద్దరు కూతుర్లు. పెద్దపాప తంగళ్లపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి. చిన్నపాప ఊర్లోని ప్రభుత్వ బడిలో ఐదో తరగతి చదువుతున్నారు. ఉదయం 4గంటలకు లేచి వంట, ఇంటి పని చేస్తాను. అప్పుడే చిన్నపాపను బడికి రెడీ చేస్తాను. వారంలో నాలుగు రోజులు డ్యూటీ, మూడ్రోజులు స్పెషల్‌ ఆఫ్‌ ఉంటుంది. ఉదయం 6గంటలకు డిపోకు వచ్చి 6.30 గంటలకు డ్యూటీపై మాకు ఇచ్చిన రూట్‌కు వెళ్తాం. డ్యూటీ టైమ్‌కు చేరాలంటే ఉదయం 5.30 గంటలకే ఆటోలో సిరిసిల్లకు వస్తాను. కండక్టర్‌గా పన్నెండేళ్లుగా ఇదే షెడ్యూల్‌ పాటిస్తున్నా. వారంలో రెండ్రోజులు పెద్దపాపను చూసేందుకు హాస్టల్‌ వెళ్తా. పిల్లలకు జ్వరం వచ్చినా, ఇంటి పని ఎక్కువైనా ముందస్తు ప్రణాళికతో సమయాన్ని వినియోగించుకుంటున్నా. ఎప్పుడైనా సెలవుల్లో దగ్గరి ప్రాంతంలో పిక్నిక్‌కు వెళాతం.

– కూతుర్లతో షాహెదా, కండక్టర్‌, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement