పెద్దపల్లి: హైదరాబాద్‌లో ఈనెల 14న నిర్వహించే పీడీఎస్‌యూ నేత జార్జిరెడ్డి వర్ధంతి స భను విజయవంతం చేయాలని ఆ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతటి రాణాప్రతాప్ కోరారు. జార్జిరెడ్డి వర్ధంతి సభ ప్రచార పోస్టర్‌ను స్థానిక నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకుడు జార్జిరెడ్డి అన్నారు. పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోకిని రమేశ్, ప్రతినిధులు సుమన్, చందు, నవీన్, శ్యామ్, సంధ్య, శ్రావణి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య రక్షణపై అవగాహన
కోల్‌సిటీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో మంగళవారం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆర్‌ఎంవో కృపాబాయి మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు జీవనశైలిలో మార్పులు అవసరమని అన్నారు. వ్యాధులను నివారించడంలో టీకాల ప్రాముఖ్యతను గుర్తించాలని తెలిపారు. వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడకూడదని, స్వయంగా చికిత్స చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ పీవో రాజమౌళి, మెడికల్ ఆఫీసర్ అతుల్య, హెల్త్ ఎడ్యుకేటర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ మృతి
ముత్తారం: ఇప్పలపల్లి(రామకృష్ణాపూర్) గ్రా మానికి చెందిన తుండ్ల సుమతి(50) పురుగు ల మందు తాగిన మైకంలో కాలుజారీ వ్యవసాయ బావిలోపడగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈనెల 4న ఆర్థిక ఇబ్బందులతో పురుగులమందు తాగిన సుమతి.. తనఇంటి సమీపంలోని వ్యవసా య బావిలో ప్రమాదవశాత్తు పడగా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
మంగళవారం.. ‘మహాలక్ష్మి’
జిల్లాలో మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా వైద్యపరీక్షలు చేశారు. గర్భిణులతోపాటు సాధారణ మహిళలకూ నిత్యం జరిగే పరీక్షలతోపాటు విటమిన్ బీ– 12, డీ–3, థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు అదనంగా చేశారు. సీ్త్రవైద్య నిపుణులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఈ ప్రక్రియ ‘మంగళవారం.. మహాలక్ష్మి’అని సిబ్బంది ‘సాక్షి’కి తెలిపారు.


