జగిత్యాల, నారాయణఖేడ్, భువనగిరి మున్సిపాలిటీలు హస్తగతం
జగిత్యాల/నారాయణఖేడ్/సాక్షి, యాదాద్రి: జగిత్యాల, నారాయణఖేడ్, భువనగిరి మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక కోసం బుధవారం సమావేశం ఏర్పాటు చేయగా.. 47 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హాజరయ్యారు. చైర్‌పర్సన్ స్థానానికి బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్ సమిండ్ల వాణిని పార్టీ ప్రతిపాదించింది. రెబల్ అభ్యర్థిగా కౌన్సిలర్ అడువాల జ్యోతి పోటీ పడ్డారు.
జ్యోతికి కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరుగురు, బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు 8 మంది, స్వతంత్రులు ఐదుగురు, ఎంఐఎం, ఏఎఫ్‌బీఐ పార్టీలకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు అనుకూలంగా ఓటు వేశారు. బీఆర్‌ఎస్ ప్రతిపాదించిన సమిండ్ల వాణికి 22 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుడు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఓటు వేశారు.
ఒకే ఒక్క ఓటు తేడాతో జ్యోతి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాగా, చైర్‌పర్సన్‌గా ఎన్నికైన జ్యోతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లడం మున్సిపల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ వశమైంది. బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మా నం నెగ్గడంతో కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ స్వరూప్ షెట్కార్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా దారం శంకర్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ వసంతకుమారి ప్రకటించారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లకుగాను బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరగా.. కాంగ్రెస్ మద్దతుదారులైన కౌన్సిలర్ల సంఖ్య 11కు చేరింది.
ఎనిమిదిమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ముగ్గురు కౌన్సిలర్లు, ఎక్స్‌అఫిíÙయో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిపి మొత్తం 12 మంది హాజరయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్‌కు సంబంధించి ఒక్కో దరఖాస్తు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అలాగే భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ పదవి కూడా బీజేపీ ఖాతాలో చేరింది.
కాంగ్రెస్‌కు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా, బీ జేపీకి చెందిన మాయ దశరథ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పదవిలో ఉన్న బీఆర్‌ఎస్‌కి చెందిన చైర్మన్, వైస్‌చైర్మన్‌పై జనవరి 23న అవిశ్వాసం పెట్టగా నెగ్గింది. దీంతో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికకు 29 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడి హో దాలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.
చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ నుంచి బొర్ర రాకేష్ పోటీలో నిలిచారు. రాకే ష్‌కు మద్దతుగా బీజేపీకి చెందిన ఐదుగురు సభ్యులు మా త్రమే చేతులెత్తారు. పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు మద్దతుగా 11 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు బీఆర్‌ఎస్, ఒక ఇండిపెండెంట్, ఒక బీజేపీ కౌన్సిలర్ చేతులెత్తారు. దీంతో చైర్మన్‌గా వెంకటేశ్వర్లు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment