11 నెలల్లో 42 మంది విద్యార్థుల మృతి
మొద్దునిద్ర వీడని సర్కార్: మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత టి. హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఒక ప్రకటనలో ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో విద్యారి్థని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని అన్నారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభు త్వం చోద్యం చూడడం శోచనీయమని విమర్శించా రు. వాంకిడిలోని గురుకుల పాఠశాల విద్యారి్థని గత 17 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నదని, బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యారి్థని బలవన్మరణానికి కారణం ఎవర ని ప్రశ్నించారు. గత 11 నెల ల్లో సగటున నెలకు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
బీఆర్‌ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకు దిగజారిపోతున్నా యని అన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాలు నరకకూపాలుగా మారాయని ధ్వజమెత్తారు.
విద్యాశాఖతోపాటు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, మైనార్టీ శాఖల నిర్వహణలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం అభం శుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్బాలు పలకడం తప్ప, ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment