
ఖమ్మం: ప్రస్తుత సిట్టింగ్‌లకే మళ్లీ సీట్టు వస్తాయనే భ్రమలో ఉండొద్దని అంటున్నారు మంత్రి కేటీఆర్. అదే సమయంలో సిట్టింగ్‌లు, మాజీలు అంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హితవు పలికారు. ఈరోజు(శనివారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన సమావేశంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు తెలిపారు. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ‘ సిట్టింగ్‌లకే సీట్లు వస్తాయనే భ్రమలో ఉండొద్దు. ఎవరికైనా టికెట రావొచ్చు.
సిట్టింగ్‌లు, మాజీ ఎంఎల్‌ఏలు కలిసి వారి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇంకా బలంగా ప్రజలలోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. సీనియర్లను గౌరవించాల్సిన అవసరం ఉంది. అనవసర విషయాలకు మీడియాకి ఎక్కొద్దు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలలో కీలకంగా మారబోతున్నాం. జనహితమే మా ఆశీర్వాదం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment