సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీకి, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి 2021 అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి నామ సంవత్సరమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఏడుపునామ సంవత్సరం అని, బీజేపీకి చీప్ లిక్కర్ నామ సంవత్సరం అని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు కొత్త పార్ట్‌నర్, కొత్త ప్యాకేజీ నామ సంవత్సరం, కమ్యూనిస్టు పార్టీలకు భూస్వామ్య అనుకూల పోరాటాలు చేసి భ్రష్టుపట్టిన సంవత్సరం అని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి ఇంకా ఏమన్నారంటే..
► వరుస ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించిన మహత్తర సంవత్సరం 2021. చంద్రబాబును కుప్పం నుంచి ప్రజలు వెలివేసిన ఏడాదిగా ప్రత్యేకత ఉంది. మొత్తంగా ప్రతిపక్షాలకు కడుపు మంట నామ సంవత్సరం. 30 నెలల్లో రూ.1.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నవరత్న పథకాలను అందించిన ఏడాదిగా రికార్డులోకి ఎక్కింది.
► బీజేపీ జాతీయ పార్టీనా లేక జోకర్ పార్టీనా అన్న సందేహం కలుగుతోంది. జిన్నా టవర్ పేల్చడానికి ఏమైనా వీరు టెర్రరిస్టులా లేక అసాంఘిక శక్తులా? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ సారా బుడ్డీ.. జిన్నా టవర్ గురించి బీజేపీ నీచ రాజకీయాలు చేయడం ఏమిటి? అఫ్గానిస్తాన్‌లో బుద్ధుని విగ్రహాన్ని పేల్చిన తాలిబన్లకు, బీజేపీకి తేడా ఏమిటి?
► ఈ విషయమై పాత మిత్రుడు చంద్రబాబు, కొత్తమిత్రుడు పవన్ కల్యాణ్ నోరు విప్పరు. కమ్యూనిస్టులు కూడా ఖండించడం లేదు. అధికారం కోసం బీజేపీ, టీడీపీ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నాయి. ఒక జాతీయ పార్టీ చీప్ లిక్కర్‌తో ఓట్లు సంపాదించాలని అనుకుంటోందంటే ఏమనుకోవాలి? హత్యా రాజకీయాలతో లబ్ధి పొందాలనే సంస్కృతి చంద్రబాబుదే.. అని అంబటి చెప్పారు.
పవన్‌కు కొత్త పార్ట్‌నర్లు, ప్యాకేజీనామ సంవత్సరం
Published Sat, Jan 1 2022 4:52 AM | Last Updated on Sat, Jan 1 2022 8:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment