చిత్తూరు కార్పొరేషన్(చిత్తూరు జిల్లా)/తిరుపతి కల్చరల్ : వైఎస్సార్‌తో పాటు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కరువు ఉండదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జగన్ పాలనలో గత నాలుగేళ్లుగా ఏ ఒక్క మండలాన్నీ కరువు ప్రాంతంగా ప్రకటించలేదని ఆనందం వ్యక్తం చేశారు. వర్షాలు సుభిక్షంగా పడుతున్నాయన్నారు. వైఎస్సార్ పాలనలోనూ సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, కానీ చంద్రబాబు పాలనలో మాత్రం కరువు తాండవిస్తుందని చెప్పారు.
ప్రపంచ బ్యాంకు నిధులు రూ.1.9 కోట్లతో చిత్తూరులో జిల్లా డేటా సెంటర్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి అంబటి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.16 కోట్లతో డేటా సెంటర్లను ఏలూరు, విజయనగరం, చిత్తూరు, విశాఖ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్ షన్మోహన్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో గంగమ్మ జాతర
ఈ ఏడాది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వెంకన్న చెల్లి గంగమ్మతల్లి జాతర ఉత్సవాలు జరుగుతుండటం సంతోషకరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుపతి గంగజాతరలో భాగంగా సోమవారం మంత్రి అంబటి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీతాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment