
అమరావతి: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్ది ట్వీట్‌పై ఏపీ మంత్రి పేర్నినాని స్పందించారు. టీఆర్‌ఎస్ పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా డైరెక్ట్‌గా మాట్లాడాలని నాని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి రోజూ రాజకీయాలు కావాలని, రోజూ రాజకీయాల్లో ఉండాలనేకునేవారు ఇలాగే మాట్లాడతారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. తాను కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలపైనే మాట్లాడానని తెలిపిన నాని.. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉంది కాబట్టే కొత్త పార్టీలు వస్తున్నాయన్నారు. తెలంగాణలో తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, కొత్త పార్టీ ఎందుకని పేర్ని నాని ప్రశ్నించారు.
ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్ని నాని గురువారం స్పందించిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలా అని చమత్కరించారు. కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్నారు పేర్ని నాని.
చదవండి: AP Cabinet: అగ్రవర్ణ పేదలకు దన్ను
కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం: పేర్ని నాని
Comments
Please login to add a commentAdd a comment