సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. అలాగే, బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అనే వాళ్లను చెప్పుతో కొట్టాలని పిలుపునిస్తున్నట్టు ఆగ్రహంగా చెప్పారు. గతంలో కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని ప్రచారం చేసి మా కొంప ముంచారంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, బండి సంజయ్ మలి విడత ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ, బీజేపీకి సంబంధం లేదు. వారికి ఉన్న అధికారాలు, ఆధారాలను అనుసరించి మాత్రమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకుంటారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. గతంలో వారే అధికారాన్ని పంచుకున్నారు. యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారు. గతంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని ప్రచారం చేసి మా కొంపముంచారు. ఇప్పుడు మళ్లీ అదే మాట అంటున్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెబుతాం.
విజయ సంకల్ప యాత్రలకు మంచి స్పందన ఉంది. వారం రోజుల్లో తెలంగాణలో వీలైనన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించబోతున్నాం. కేంద్రంలో 370 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే మా టార్గెట్. ఆ టార్గెట్‌ను తప్పకుండా రీచ్ అవుతాం. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. తెలంగాణలో కూడా హైదరాబాద్ సహా 17 సీట్లు గెలుస్తాం. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. బీఆర్‌ఎస్ పార్టీది మూడో స్థానమే. కొండగట్టుకు నిధులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారు. కొండగట్టు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుంచి తప్పకుండా సహకారం ఉంటుంది అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment