సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా నేతలు నినాదాలు చేశారు. కార్యాలయం లోపలే అర్వింద్ వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగారు.
ఈ సందర్బంగా వారిని పార్టీ కార్యాలయం నుంచి వెళ్లాలని రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి కోరారు. ఇక, ఇదంతా జరుగుతున్న క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆఫీసులో ఉండటం విశేషం. ఇదే సమయంలో బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల అధ్యక్షులను పార్టీ నిబంధనలను విరుద్దంగా మార్చినట్టు తెలిపారు. ఈ విషయంలో కిషన్‌రెడ్డి కలుగజేసుకుని సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం.. ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి: అమిత్ షా పర్యటన వేళ కీలక పరిణామం.. రఘునందన్, అర్వింద్‌కు కీలక బాధ్యతలు!
Comments
Please login to add a commentAdd a comment