Bengaluru: BJP MLA Renukacharya Apologises Over His Comments On Girls Dressing - Sakshi
Sakshi News home page

అందుకే అత్యాచారాలు.. బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

Published Thu, Feb 10 2022 9:15 AM | Last Updated on Thu, Feb 10 2022 12:29 PM

BJP MLA Renukacharya Apologises For women Clothes That Excite - Sakshi

బెంగళూరు: తరచూ వివాదాల్లో ఉండే బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మళ్లీ వివాదాన్ని రేకెత్తించారు. మహిళల బట్టలను చూసి పురుషులు ఉద్రేకానికి గురవుతారని ఆయన బుధవారం ఢిల్లీలో అన్నారు. మహిళలు బికిని ధరించటం వారి హక్కు అని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ చెప్పడాన్ని ఖండించారు.

ఆమె దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొన్నిసార్లు మహిళల వస్త్రధారణ పురుషులకు ఉద్రేకాలను కలిగిస్తుందని ఆయన అన్నారు. ఆయన మాటలపై విమర్శలు రావడంతో తను చేసిన వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణలు చెప్పారు.

స్త్రీలను అవమానించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని తెలిపారు. ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను అవమానించేలా ఉన్నాయని తెలిపారు. ఆమె మహిళలకు క్షమాపణలు చెప్పాలని రేణుకాచార్య డిమాండ్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement