Renukacharya
-
ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అనుమానాస్పద మృతి.. హత్యకేసుగా..
సాక్షి, బెంగళూరు(బనశంకరి): హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అనుమానాస్పద మృతికి సంబంధించి హొన్నాళి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. తుంగా కాలువలో బయటపడిన కారులో వెనుకసీట్లో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. దీంతో హొన్నాళి పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. కుందూరులో చంద్రశేఖర్ అంత్యక్రియలు దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కుందూరు గ్రామంలోని రేణుకాచార్య తల్లిదండ్రులు సమాధుల వద్ద శుక్రవారం చంద్రశేఖర్ అంత్యక్రియలను వీరశైవ లింగాయత్ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో గురువారం అర్థరాత్రి శవపరీక్షలు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎల్కు నివేదిక పంపించారు. అంతిమ దర్శనం కోసం తరలివచ్చిన ప్రజలు హొన్నాళి పట్టణంలోని రేణుకాచార్య ఇంట్లో చంద్రశేఖర్ అంతిమ దర్శనం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్ప, కుమారుడు కేఎస్.కాంతేశ్, పార్టీ నేతలు కార్యకర్తలు అంతిమ దర్శనం చేసుకున్నారు. చదవండి: (తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే) స్పీడోమీటర్‌లో 100 కిలోమీటర్ల వేగం నమోదు చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైన ఘటన స్థలాన్ని శుక్రవారం ఏడీజీపీ అలోక్ కుమార్ పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. అక్టోబరు 30 తేదీ రాత్రి 11.58 నిమిషాలకు న్యామతి వద్ద చంద్రశేఖర్ కారు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు రికార్డయింది. అదేరోజు రాత్రి 12.06 నిమిషాలకు చంద్రశేఖర్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. మృతదేహం లభించిన స్థలానికి న్యామతికి 10 కిలోమీటర్లు దూరం ఉంది. కాల్ హిస్టరీ, సీడీఆర్‌తో పాటు అన్నింటిని తనికీ చేసి వీటితో డయాటైమ్ టెస్ట్‌సైతం చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తరువాత విషయాలు వెల్లడవుతాయన్నారు. దావణగెరె ఎస్పీ రిష్యంత్ నేతృత్వంలో దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. మాజీ సీఎం యడియూరప్ప నివాళి హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య నివాసానికి శుక్రవారం మాజీ సీఎం యడియూరప్ప వచ్చి చంద్రశేఖర్ పార్థివదేహాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో యడియూరప్ప మాట్లాడారు. చంద్రశేఖర్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని రేణుకాచార్య చెప్పినట్లు నిజమైంది. సీఎం బొమ్మై, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర చొరవతో దర్యాప్తు వేగంగా సాగుతోందన్నారు. -
అందుకే అత్యాచారాలు.. బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
బెంగళూరు: తరచూ వివాదాల్లో ఉండే బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మళ్లీ వివాదాన్ని రేకెత్తించారు. మహిళల బట్టలను చూసి పురుషులు ఉద్రేకానికి గురవుతారని ఆయన బుధవారం ఢిల్లీలో అన్నారు. మహిళలు బికిని ధరించటం వారి హక్కు అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ చెప్పడాన్ని ఖండించారు. ఆమె దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొన్నిసార్లు మహిళల వస్త్రధారణ పురుషులకు ఉద్రేకాలను కలిగిస్తుందని ఆయన అన్నారు. ఆయన మాటలపై విమర్శలు రావడంతో తను చేసిన వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణలు చెప్పారు. స్త్రీలను అవమానించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని తెలిపారు. ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను అవమానించేలా ఉన్నాయని తెలిపారు. ఆమె మహిళలకు క్షమాపణలు చెప్పాలని రేణుకాచార్య డిమాండ్ చేశారు. -
‘మా సీఎం మారడు.. 65 మంది మద్దతు ఉంది’
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం మారడని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై రేణుకాచార్య విరుచుకుపడ్డారు. వారి పక్క నియోజకవర్గాన్ని గెలిపించుకునే సత్తాలేనివారు యడియూరప్ప గురించి మాట్లాడుతుండడం వింతగా ఉందని పేర్కొన్నారు. యత్నాళ్ పిచ్చోడి తరహాలో మాట్లాడారని తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఏమి జరగదని చెప్పారు. వారం కిందట 18 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు మద్దతుగా తాము ఢిల్లీకి వెళ్లి వస్తామని చెప్పారని.. అయితే ఏ సమస్య లేదని యడియూరప్ప చెప్పినట్లు’ రేణుకాచార్య వివరించారు. ఈ సమయంలో యడియూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలోనూ యడియూరప్ప వృద్ధాప్యంలో చురుగ్గా పని చేస్తున్నారని రేణుకాచార్య తెలిపారు. కోవిడ్ సందర్భంలో కొందరు ఢిల్లీకి వెళ్లి ఏవేవో ప్రయత్నాలు చేయడం సరికాదని ప్రత్యర్థి గ్రూపులకు హితవు పలికారు. నాయకత్వ మార్పు వివాదం రేగిన నేపథ్యంలో యడియూరప్పకు మద్దతుగా 65 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, దానికి సంబంధించిన లేఖ తన వద్ద ఉందని రేణుకాచార్య తెలిపారు. చదవండి: కలకలం..ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం చదవండి: ‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’ -
కూటమి కుప్పకూలిన వేళ ఎమ్మెల్యే డ్యాన్స్
బెంగళూరు: కర్ణాటకలో దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు నిన్నటితో తెరపడింది. సుమారు14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంతోషంలో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య, కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో తెగ వైరలవుతోంది. రేణాకాచార్య కర్ణాటక దేవంగరే జిల్లా హోన్నాళి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. #WATCH Karnataka BJP MLA Renukacharya dances with supporters outside the Ramada Hotel in Bengaluru. HD Kumaraswamy led Congress-JD(S) government lost trust vote in the assembly, today. pic.twitter.com/6MBQNgzg4R — ANI (@ANI) July 23, 2019 స్పీకర్ సూచన మేరకు మంగళవారం సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ నుంచి 65 మంది, జేడీఎస్‌కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది. -
సొంత గూటికి యడ్డి
యడ్డికి బీజేపీ తీర్థం పూర్తయిన లాంఛనం శోభా, రేణుకాచార్య, సీఎం ఉదాసీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరిక సాక్షి, బెంగళూరు : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప గురువారం లాంఛనంగా బీజేపీలో చేరారు. ఇక్కడి మల్లేశ్వరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం జగన్నాథ భవన్‌కు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు యూబీ. బనకార, విశ్వనాథ పాటిల్, సుమారు 300 మంది కార్యకర్తలు ఊరేగింపుగా వచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ అధ్యక్షుడు కేఎస్. ఈశ్వరప్ప యడ్యూరప్పకు ఎదురు వెళ్లి మెడలో పూలమాల వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. యడ్యూరప్పతో పాటు ఎమ్మెల్యేలు బనకార, విశ్వనాథ పాటిల్ రూ.105 చెల్లించి సభ్యత్వాన్ని తీసుకున్నారు. అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ .. అధికార వ్యామోహంతో తాను తిరిగి బీజేపీలోకి రాలేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలనేదే తన లక్ష్యమన్నారు. బీజేపీని వదిలి తప్పు చేశానన్నారు. ఇకపై అలాంటి తప్పులు జరగబోవని సంజాయిషీ ఇచ్చారు. బీజేపీ నాయకులు మనసులో ఏమీ పెట్టుకోకుండా కేజేపీ నాయకులకు, కార్యకర్తలకు వారి సామర్థ్యానికి తగిన విధంగా పార్టీ పదవులు ఇవ్వాలని సూచించారు. కాగా మాజీ మంత్రులు శోభా కరంద్లాజె, రేణుకాచార్య, సీఎం. ఉదాసీ తదితరులు కూడా ఇదే సందర్భంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనంతకుమార్, మాజీ ముఖ్యమంత్రులు సదానందగౌడ, జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఆర్. అశోక్, కేఎస్. ఈశ్వరప్ప, ఎమ్మెల్సీ తార తదితరులు పాల్గొన్నారు.