
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబుపై బ్రాహ్మణులు కన్నెర్ర చేశారు. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయాన్ని బ్రాహ్మణులు ముట్టడించారు. సరిపెళ్ల రాజేష్(మహాసేన రాజేష్) బ్రాహ్మణ మహిళలను అవమానించడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్‌కి ఇచ్చిన సీటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు.
24 గంటల్లో సరిపెళ్ల రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరిన చంద్రబాబు స్పందించ లేదు. బ్రాహ్మణ మహిళలంటే రాజేష్‌కి అంత చులకనగా కనిపిస్తున్నారా? అంటూ ధ్వజమెత్తారు. బ్రాహ్మణుల సత్తా చంద్రబాబుకి చూపిస్తాం. క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment