సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్‌లపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..
ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం!
మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా.. నేడు మహనగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్!
కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా!
తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!
ఇప్పుడైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు!
కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పావని!
లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని అబద్ధపు ప్రచారాలు చేశావని!
అధికారం కోసం కాళేశ్వరాన్ని నిందించినా…
నేడు ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరం! అంటూ కామెంట్స్ చేశారు.
ఎంత విషం చిమ్మినా…తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం!
మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా…నేడు మహనగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్!
కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా!
తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!
ఇప్పుడైనా… pic.twitter.com/GHVRj3fokN— KTR (@KTRBRS) January 4, 2025
Comments
Please login to add a commentAdd a comment