సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ చేయాలని బ్యాంక్‌ల వద్దకు వెళ్లిన వారిని హింసిస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలనా? అని ప్రశ్నించారు.
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా? లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన?.
తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు...
తీరా అధికారంలోకి వచ్చాక... రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా? లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా?
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన...?
I demand… pic.twitter.com/qjl6dfmNhh— KTR (@KTRBRS) September 26, 2024
ప్రభుత్వం చేసిన తప్పిదానికి రైతులను కరడుగట్టిన నేరస్థులుగా పరిగణిస్తున్నందుకు సీఎం బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను!. మీరు మీ వాగ్దానాలను అందించడంలో విఫలమయ్యారు. మీరు ఇచ్చిన హామీని తీర్చాలని వచ్చినప్పుడు వారిని అరెస్టు చేస్తారా?. అలాగే కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మీకు ఆహారం ఇచ్చే చేతులను గౌరవించడం నేర్చుకోండి!’.
అన్నం పెట్టే అన్నదాతపై పోలీస్ జులూమ్. ఒకరు దర్వాజాలు పీకుతారు-మరోకరు కేసులు పేట్టి లోపలేస్తాం అంటారు. మాఫీ కాలేదు మాఫీ చెయ్యండి మొర్రో అంటూ రైతులు నానా తంటాలు పడుతుంటే మరో వైపు కేసులు పెడతాం అంటూ పోలీసుల బెదిరింపులు. కేసులు పెట్టి లక్ష ఖర్చయ్యేదాకా తిప్పుదాం అని అన్నదాతపై పోలీసుల దాష్టీకాలు. రుణమాఫీపై శృతి గతి లేని మాటలతో ఇప్పటికే సర్కార్ రైతుల ఊసురు పోసుకుంటే అధికారుల అతి అన్నదాతలను మరింత అగాధంలోకి నెట్టుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖబర్దార్ కాంగ్రెస్ పాలకులారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: హైడ్రా పేరుతో హైడ్రామాలు: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment