కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి: కేటీఆర్‌ సెటైర్లు | BRS MLA KTR Satirical Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి: కేటీఆర్‌ సెటైర్లు

Aug 26 2024 8:43 AM | Updated on Aug 26 2024 8:43 AM

BRS MLA KTR Satirical Comments On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. 

  • రుణమాఫీ అయిన రైతులకన్నా..
    కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ 

  • అన్నివిధాలా అర్హత ఉన్నా..
    ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు..

  • రెండు సీజన్లు అయినా..
    రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే

  • జూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. 
    ఆగష్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వెయ్యలే..!!

  • కౌలు రైతులకు.. 
    ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!

  • రైతు కూలీలకు.. 
    రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!
    కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయింది‌ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

 

 


ఇదే సమయంలో రాష్ట్రంలో డెంగ్యూ మరణాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు రాష్ట్రంలో డెంగ్యూ మరణాలే లేవని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు  పత్రికల్లో డెంగ్యూతో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే డెంగ్యూ కారణంగా ఐదుగురు చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈరోజు మరో ముగ్గురు చనిపోయినట్లు వార్తాపత్రికల్లో వార్తలు చూస్తున్నాం. మరి నిజాల్ని ప్రభుత్వం ఎందుకు దాచుతున్నట్లు?. ఆసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేవు లేవు. ఒకే బెడ్‌పై ముగ్గురు నుంచి నలుగురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అంటూ సీఎస్‌కు కోరారు.


 

 మరోవైపు.. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంపై కూడా కేటీఆర్‌ ప్రశ్నించారు.‘పసి పిల్లల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం??. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు ఆహారంగా కుళ్లిన గుడ్లు.  భువనగిరి, పెద్దవాడ సమ్మద్ చౌరస్తా అంగన్‌వాడీ కేంద్రంలో.. ఆ కుళ్లిన గుడ్లు చిన్న పిల్లలు తింటే ఏంటి పరిస్థితి?. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ?. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు?. ఓ వైపు గురుకులాల్లో మరణాలు.. మరోవైపు అంగన్‌వాడీల్లో అడుగడుగునా అలసత్వం. పిల్లల పాలిట యమపాశంగా తయారైన కాంగ్రెస్ సర్కార్? అంటూ ట్విట్టర్‌లో కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement