సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గీత దాటింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో పీఏసీ చైర్మన్ పదవి అరికెపూడి గాంధీకి ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..
ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవా? సిగ్గు.. సిగ్గు..
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై.. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం?
ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి ??
గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం. రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్తోంది. సంప్రదాయాలను మంటగలుపుతోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.
పార్లమెంట్‌లో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు కట్టబెట్టిన విషయం మరిచారా ?
దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం? రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా? అంటూ ప్రశ్నించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేకు PAC ఛైర్మన్ పదవా ? సిగ్గు.. సిగ్గు..
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై..
హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం ?
ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి ??
గీత దాటిన కాంగ్రెస్… https://t.co/fFvHDSXkDa— KTR (@KTRBRS) September 9, 2024
ఇది కూడా చదవండి: TG: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. డబ్బు, ఇల్లు ఇంకా..
Comments
Please login to add a commentAdd a comment