సాక్షి, ఖమ్మం: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. తాను పార్టీ సభ్యుడినే కాదన్నప్పుడు ఎలా సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. జనవరి నుంచి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నానని తెలిపారు. వంద రోజుల తర్వాత అయినా బీఆర్‌ఎస్ నేతలు ధైర్యం తెచ్చుకొని నన్ను సస్పెండ్ చేశారని అన్నారు
ఈ మేరకు సోమవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. వెస్సార్‌సీపీలో ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌లోకి (ప్రస్తుత బీఆర్‌ఎస్) రావాలని ఎన్నోసార్లు ఆహ్వానించారని తెలిపారు. తనపై ఒత్తిడి తీసుకొచ్చి.. కేటీఆర్ అనేకసార్లు మాట్లాడి ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ చెప్పారని, ఆయన మాయమాటలు నమ్మి పార్టీలో చేరానని పేర్కొన్నారు.
చదవండి: బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్: జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
‘మా గతి మీకూ పడుతుందని చాలామంది బీఆర్‌ఎస్ నేతలు అప్పుడే చెప్పారు. పాలేరు ఉప ఎన్నికలో విజయం కోసం నాపై ఒత్తిడి తెచ్చారు. 6 నెలలు మా సార్ నిన్ను కింద నడవనీయరని తోటి ఎంపీలు చెప్పారు. ఆరు నెలల తర్వాత మా సార్ అసలు రూపం తెలుస్తుందని అన్నారు. ఆరు నెలలు కాదు నా విషయంలో 5 నెలల్లోనే పరిస్థితి అర్థమైంది.
‘బంగారు తెలంగాణ చేస్తామని ఇప్పుడేం చేస్తున్నారు. గత ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వకపోయినా కేటీఆర్ కోసమే పార్టీలో ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీలో కొనసాగాను. 2018 లో ఖమ్మం జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యేనే గెలవడానికి కారణం ఏంటో చర్చించారా. ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్.’ అని పొంగులేటి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment