సాక్షి, హైదరాబాద్, పంజగుట్ట: తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్ పూర్తిస్థాయి మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మిషన్ చాణక్య సంస్థ సర్వే పేర్కొంది. రైతులతోపాటు మహిళలు, మైనారిటీలు ఆ పార్టీవైపే మొగ్గు చూపుతున్నారని తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ ఓట్లశాతం పెరిగినా సీట్లు పెద్దగా పెరగవని తేలిందని పేర్కొంది. ఈ మేరకు మిషన్ చాణక్య వ్యవస్థాపక చైర్మన్ అముక శివకేశవ్ ఆదివారం హైదరా బాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో వివరాలు వెల్లడించారు. ౖమిషన్ చాణక్యకు చెందిన 6,500 మంది ఉద్యోగులు 110 నియో జకవర్గాల పరిధిలో 14 లక్షల మంది నుంచి రహస్యంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్టు తెలిపారు. సర్వేలో పేర్కొన్న ముఖ్యాంశాలివీ..
♦ బీఆర్‌ఎస్ 44.62 శాతం ఓట్లతో 76 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్‌కు 32.71 శాతం ఓట్లతో 25 సీట్లకు అటూఇటూగా వస్తాయని సర్వే పేర్కొంది. ఇక బీజేపీ 17.6 శాతం ఓట్లతో 9 స్థానాల వరకు గెలుచుకుంటుంది.
♦ బీసీలలో 45.97 శాతం మంది బీఆర్‌ఎస్‌కే మద్దతు చూపారు. అదే కాంగ్రెస్‌కు 26.70 శాతం, బీజేపీకి 24.60శాతం మొగ్గు చూపారు.
♦ ఓసీల్లో బీఆర్‌ఎస్‌కు 41.20 శాతం మంది మొగ్గు చూపగా.. కాంగ్రెస్‌కు 29.62శాతం, బీజేపీకి 24.89 శాతం జైకొట్టారు.
♦ ఎస్సీల్లో 43.17 శాతం మంది బీఆర్‌ఎస్‌వైపే ఉండగా.. కాంగ్రెస్‌కు 33.67 శాతం, బీజేపీకి 16.60 శాతం మద్దతిచ్చారు.
♦ ఎస్టీల్లో 44.45శాతం బీఆర్‌ఎస్‌కు, 37.16 శాతం కాంగ్రెస్‌కు, 16.41 శాతం బీజేపీకి సానుకూలంగా ఉన్నారు.
♦ మైనారిటీలకు వస్తే.. గులాబీ పార్టీకి 48.31 శాతం, కాంగ్రెస్ పార్టీకి 36.41 శాతం, బీజేపీకి 5.52 శాతం మద్దతు వస్తోంది.
♦ పురుషుల్లో 38.91 శాతం మంది బీఆర్‌ఎస్‌కు, 33.76శాతం కాంగ్రెస్‌కు, 20.14 శాతం బీజేపీకి మద్దతు పలుకుతున్నారు.
♦ మహిళల్లో బీఆర్‌ఎస్‌కు 50.32 శాతం, కాంగ్రెస్‌కు 31.65శాతం, బీజేపీకి 15.05 శాతం మొగ్గు కనిపిస్తోంది.
♦హైదరాబాద్ నగరం పరిధిలో మాత్రం బీజేపీ బలంగా ఉందని సర్వే పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆ పార్టీకి 38.21శాతం మంది ఓటర్లు మొగ్గుచూపగా.. బీఆర్‌ఎస్‌కు 37.13శాతం మద్దతు వచ్చినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment