![Chandrababu Reduced Number Of Seats For Bcs - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/14/chandrbabu12.jpg.webp?itok=dhC5qiLB)
సాక్షి, గుంటూరు: టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేసే చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలకు వెన్నుపోటు పొడిశారు. బీసీలకు భారీగా సీట్ల తగ్గించారు. రెండు లిస్టులలో కలిపి ఇప్పటికి బీసీలకు కేటాయించింది కేవలం 24 సీట్లే.. గత ఎన్నికల్లో 43 ఇచ్చి ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు. తన సొంత సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కమ్మలకు ఏకంగా 28 సీట్లను కేటాయించుకున్న చంద్రబాబు.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న చంద్రబాబు.. కాపులకు 8, మైనారిటీలు 3 సీట్లకే పరిమితం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై కమ్మేతర వర్గాలు ఫైర్ అవుతున్నారు.
అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక వదలించుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ‘బీసీలు టీడీపీకి బ్యాక్ బోన్’ అంటూ ఉత్తుత్తి మాటలతో దశాబ్దాలుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు.
న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment