
సాక్షి, నాందేడ్: ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెడితేనే.. దేశంలో సమస్యలు పరిష్కారం అవుతాయని బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం నాందేడ్(మహారాష్ట్ర)లో బీఆర్‌ఎస్ శిక్షణా తరగతుల్ని ప్రారంభించి.. ఆయన ప్రసంగించారు.
నేడు దేశ రాజధాని ఢిల్లీలో నీరు కూడా దొరకడం లేదు. కరెంట్ ఉండడం లేదు. దేశంలో వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు అనవసర విషయాలపై కాకుండా.. అభివృద్ధిపై దృష్టిసారించాలి. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. దేశం ప్రబల శక్తిగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారాయన.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో MLA ఫ్లెక్సీల కలకలం
Comments
Please login to add a commentAdd a comment