
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయుల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న తీరు నిర్లక్ష్యంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్ల పాత్ర మరువలేనిదని చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలిచి ఉపాధ్యాయులను మాత్రం ఆహ్వానించకపోవడానికి గల కారణం ఏంటో చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. మొన్న జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులకు ఎన్నికల బాధ్యతలు ఇవ్వకుండా దూరం పెట్టారని, దీన్ని బట్టి వారి పట్ల కేసీఆర్ చూపిస్తున్న వివక్ష బట్టబయలైందని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లు దాటినా పీఆర్‌సీ ఎందుకు అమలు చెయ్యడం లేదని ప్రశ్నించారు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రకటించారు. (పొలిటికల్ రౌండప్: 2020 నేర్పిన పాఠమిది! )
Comments
Please login to add a commentAdd a comment