సాక్షి, వరంగల్: తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. నేటితో ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. నేడు వరంగల్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
వరంగల్ బీఆర్‌ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనను మీరు బేరీజు వేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచింది. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తించి ఓటు వేస్తే మంచి జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఎన్‌కౌంటర్లే. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలే. తెలంగాణ ప్రజలను గోస పెట్టించుకున్నారు.
1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే. చాలా రాష్ట్రాలు మద్దతిచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తే తెలంగాణ ప్రకటన చేశారు. కాంగ్రెస్ హయాంలో వరంగల్ సిటీకి ఎన్నిరోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండేవి. 50 కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదు.
తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం కోసమే బీఆర్‌ఎస్ పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో ఇది నా 95వ సభ. తెలంగాణలో విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. వరంగల్ అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. హెల్త్ యూనివర్సిటీని స్థాపించుకున్నాం. వరంగల్‌కు ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. బీసీలకు సీట్లు ఇచ్చిన ప్రతీ చోటా అందరూ ఏకమై వారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment