సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని నాలుగైదు రోజుల్లో ప్రకటిం చడానికి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. గతంలో రద్దుచేసిన జిల్లా కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలకు అధ్యక్షులు లేదా కన్వీనర్ల నియామకంపై దృష్టి సారించారు. దీంతో పార్టీ పదవులు ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఆరంభంలో సభ్యత్వ నమోదుతో ప్రారంభమైన టీఆర్‌ఎస్ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ వివిధ కార ణాలతో తరచూ వాయిదా పడుతూ వస్తోంది. గత అక్టోబర్‌లో జరిగిన ప్లీనరీలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గం మాత్రం ఏర్పాటు కాలేదు.
అధినేతకు ఆశావహుల జాబితాలు
జిల్లా కమిటీ అధ్యక్షుడు లేదా కన్వీనర్ పదవిని ఆశిస్తున్న నేతల జాబితాలను, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న రా ష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇప్పటికే కేసీఆర్‌కు అందజేశారు. ఆయా జాబితాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కన్వీనర్ల నియామకంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూర్పుపై అధినేత కసరత్తు చేస్తున్నారు.
చదవండి: ఆ 5 రాష్ట్రాల్లో ఎన్నికలైతే, ఢిల్లీలో పార్టీల ప్రచారమెందుకు? కారణం ఇదే..
పదవుల్లో లేనివారికి బాధ్యతలు
జిల్లా కన్వీనర్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో అధికార పదవుల్లో లేని వారికి బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నా రు. మరోవైపు అధికార పదవులు దక్కవనే అంచనాతో కొందరు, పార్టీలో ఏదో ఒక పదవి ఆశిస్తున్న మరికొందరు కమిటీల్లో తమకు అవకాశమివ్వాలని కేసీఆర్‌కు, కేటీఆర్‌కు వినతులు అందజేస్తున్నారు. కేసీఆర్ మాత్రం మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సమర్ధులైన నేతలకే కమిటీల్లో చోటివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. జిల్లా కమిటీలను పూర్తిస్థాయిలోనా లేదా కన్వీనర్ల నియామకంతోనే సరిపెడతా రా? అనేది వేచిచూడాల్సి ఉంది.
మండల, పట్టణ కమిటీలు పూర్తి
ఈ ఏడాది అక్టోబర్‌లోగా రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు మండల, పట్టణ స్థాయి కమిటీలే ఏర్పాటయ్యాయి. 2017 అక్టోబర్‌లో 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సహాయ కార్యద ర్శులతో ఏర్పాటైన రాష్ట్ర కార్యవర్గం ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ నోచుకోలేదు. రాష్ట్ర కార్యవర్గంలోని సత్యవతి రాథోడ్, సం తోష్‌కుమార్, బస్వరాజు సారయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, బండా ప్రకాశ్, పి.రాములు, మైనంపల్లి హన్మంతరావు, భా నుప్రసాద్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారికి వివిధ పదవులు దక్కాయి. పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కేకే రాజ్యసభ సభ్యుడి గా, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభా ష్‌రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
చదవండి: ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మంది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ?
అనుబంధ కమిటీల పునర్వ్యవస్థీకరణ
టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీకి అనుబంధంగా మరో పది కమిటీలు పనిచేస్తుండగా మహిళా, యువజన విభాగాల అధ్యక్షులకు అధికార పదవులు దక్కాయి. మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి వరంగల్ మేయర్‌గా, ఇంకా ఇతర నాయకులకు వివిధ పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో ఆయా కమిటీల్లో నిబద్ధత కలిగిన చురుకైన నేతలు, సీనియర్లకు చోటు కల్పించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment