TS Assembly: సీఎం రేవంత్‌ Vs హరీశ్‌ రావు మాటల యుద్ధం | CM Reventh Reddy Vs Harish Rao, Serious Arguments Between Both In Telangana Assembly Session - Sakshi
Sakshi News home page

TS Assembly Revanth Reddy Vs Harish Rao: సీఎం రేవంత్‌ Vs హరీశ్‌ రావు మాటల యుద్ధం

Published Wed, Dec 20 2023 2:28 PM | Last Updated on Wed, Dec 20 2023 7:11 PM

CM Reventh Reddy Serious Comments In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వాడీవేడీ చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కూడా రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. హరీష్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హరీష్ రావు మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి, రెండో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. గత పదేళ్లలో నీటిపారుదల శాఖను కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.97,449 లోన్ మంజూరు అయితే విడుదల అయింది రూ.79, 287కోట్లు. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు కాకుండా ఇంకా నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 80వేల కోట్లు కాదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు నిధులు వేరే వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను అమ్మేందుకు గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. కాళేశ్వరం నీళ్ళు అమ్ముతామని రూ.5,100 కోట్ల అప్పులు చేశారు. 2014కు ముందు తెలంగాణ ప్రజలు మంచినీళ్ళు, ఇళ్లలో నల్లా కనెక్షన్లు ఉన్నట్లు గత ప్రభుత్వం చెప్తోంది. మిషన్ భగీరథపై రూ.5వేల కోట్ల ఆదాయం వస్తుందని బ్యాంకులను మభ్యపెట్టి లోన్స్ తెచ్చారు.

నీళ్ళపై వ్యాపారం చేసి కాళేశ్వరంపై రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథపై రూ.5వేల కోట్లు అప్పులు తెచ్చారు. TSIICకి వచ్చిన లోన్ నిధులకు ప్రభుత్వమే బాధ్యత అని గ్యారెంటీ ఇచ్చారు. అప్పుల కోసం ఆదాయం తప్పుగా చుపించిందంటూ కాగ్ నివేదిక ఇచ్చింది. తన పద్ధతి మార్చుకోవాలంటూ కాగ్‌ గత ప్రభుత్వానికి హెచ్చరించింది.శాసన సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు మాట్లాడితే చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్‌ చేశారు. 

అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ.. సభను నేను తప్పుదోవ పట్టించలేదు. సీఎం రేవంత్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అంతా అర్థం కలవాలంటే కొంత టైం పడుతుంది. కాళేశ్వరంపై తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మాత్రమే తీసుకోలేదు. పాలమూరు రంగారెడ్డితో పలు ప్రాజెక్టులకు ఉపయోగించారు. రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు. ప్రజల నిర్ణయం అనేది ఫైనల్. మీ తెలివి తేటలతో నిధులు తీసుకురండి. గత ప్రభుత్వాన్ని బాద్నాం చేయకండి. మా పై నెపం నెట్టి తప్పించుకోకండి. మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement