సాక్షి, ఖమ్మం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌లో ప్రారంభమైన తన పాదయాత్ర ఖమ్మంలో ముగుస్తుందన్నారు. ఖమ్మంలో జనగర్జన పేరుతో ముగింపు సభ జరగబోతున్నట్టు తెలిపారు. అధికార మదాన్ని దించాడానికే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అని స్పష్టం చేశారు.
కాగా, భట్టి విక్రమార్క కూసుమంచిలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో జూలై 2న జరిగే సభకు రాహుల్ గాంధీ హాజరవుతారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్‌లపై దమ్ముంటే చర్చకు రావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌లను ఎందుకు ఆపిందో చెప్పాలి. అభివృద్ధి అంటే కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లకు మధ్యలో స్తంభాలు, రంగులు వేయడం కాదు. రాజకీయాలకు అతీతంగా పోలీసులు పనిచేయాలి. పోలీసులు పాలేరు ఎమ్మెల్యే ఆదేశాలతో పని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చట్ట ప్రకారం చర్యలుంటాయి.
సింగరేణిని ప్రయివేటు పరం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు ఏమీ ఇవ్వకుండా సున్నా చూపెట్టారు. పాలేరు శాసనసభ్యుడిని కాంగ్రెస్ గుర్తుపై గెలిపిస్తే కేసీఆర్ దగ్గర కాంట్రాక్టుల కోసం ఓట్లను అమ్ముకున్నాడు. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలనుంటే కాంగ్రెస్ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారాలి. ప్రజాస్వామ్య ద్రోహి పాలేరు ఎమ్మెల్యే. మీరు వేసే ఓటుకు ఎవరు గౌరవిస్తారో వారికే ఓటు వేయండి. ఓటును అమ్ముకునే నాయకులను గ్రామాల్లోకి రానివ్వకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: బీజేపీలో పెను మార్పులు!.. కేంద్రమంత్రిగా బండి, కిషన్ రెడ్డి, ఈటలకు..
Comments
Please login to add a commentAdd a comment