సాక్షి, హైదరాబాద్ : రాబోయే గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో బోగస్ ఓట్లతో ప్రభుత్వం అక్రమ డిమిలిటేషన్ కుట్రలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు అప్రమతంగా ఉండి వాటిని ఛేదించి విజయం సాధించాలని అన్నారు. మంగళవారం నాడు ఇందిరా భవన్ లో గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో బోగస్ ఓట్లను టీఆర్ఎస్ పెద్దఎత్తున చేర్పించి లబ్ది పొందాలని చేస్తోందిన డివిజన్లలో ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఓట్లు నమోదు చేసి ఉన్నాయని ఇదంతా లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో డిమిలిటేషన్ లో పకడ్బందీగా చేసే విదంగా నగర నాయకులు చర్యలు తోసుకోవాలని ఉత్తమ్ అన్నారు. 150 డివిజన్లలో కాంగ్రెస్ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయాలని నాయకులు ఇంటింటికి, గడప గడపకు తిరిగి ఓటర్ల తమ వైపు తిప్పుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు మాట్లాడుతా.. కాంగ్రెస్ నాయకులు నగరంలో, డివిజన్లలో సమన్వయంతో పని చేయాలని గెలుపే లక్ష్యం గా పని చేయాలని అన్నారు. పార్టీ విజయం సాధించడానికి చేయాల్సిన వ్యూహాలను మాజీ ఎంపీ హనుమంత రావ్, మర్రి శశిధర్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, నిరంజన్ తదితరులు వివరించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, కొండ విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment