
సాక్షి, ముంబై: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేసి నెగ్గాలని ఆయనకు సవాలు విసిరారు. అమరావతి ఎంపీ అయిన నవనీత్ జైలు నుంచి విడుదలయ్యాక ఆస్పత్రిలో చేరారు.
ఆదివారం డిశ్చార్జ్ అయ్యాక విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉద్ధవ్‌ను ఆయనకు నచ్చిన చోటునుంచి పోటీ చేయమనండి. ఆయనపై నేను తలపడతాను. అప్పుడే ప్రజల పవర్ ఏంటో ఆయనకు తెలుస్తుంది’’ అన్నారు. ఉద్ధవ్ చట్టసభలకు ఎన్నికవకుండానే 2019లో సీఎం అయ్యారు. తర్వాత శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.
చదవండి: ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న నవనీత్, ఓదార్చిన భర్త రవి రాణా.. వైరల్ వీడియో