udhav tackrey
-
మళ్లీ గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయి
ముంబై: అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు జనవరి నెలాఖరుకల్లా పూర్తయ్యే అవకాశమన్నందున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉండగా రామాలయం ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతారని వారు తిరిగి వెళ్లే సమయంలో గోద్రా తరహా అల్లర్లు జరిగే అవకాశముందని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే. అల్లర్లు జరుగుతాయి.. జల్గావ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఉద్ధవ్ ఠాక్రే వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న రామ మందిరం ప్రారంభోత్సవం గురించిన ప్రస్తావన చేశారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భక్తులు బస్సుల్లోనూ, రైళ్లలోనూ లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశముందని వారు తిరిగి వెళ్లే సమయంలో వారిపై దాడులు జరుగుతాయని దుండగులు రాళ్లు రువ్వుతారని అన్నారు. గోద్రా అల్లర్ల తరహాలోనే హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశముంటుందని హెచ్చరించారు. VIDEO | "It is a possibility that the government could invite a large number of people for the Ram Temple inauguration in buses and trucks, and on their return journey, an incident similar to that in Godhra may occur," said Shiv Sena (UBT) leader Uddhav Thackeray earlier. STORY… pic.twitter.com/iEZocaMs9c — Press Trust of India (@PTI_News) September 11, 2023 గోద్రా తరహాలోనే.. 2022, ఫిబ్రవరిలో జరిగిన గోద్రా అల్లర్లు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టింఛాయా అందరికి తెలిసిందే. ఈ హింసాకాండలో 58 మంది మృతి చెందగా ఎందరో గాయాల పాలయ్యారు. గోద్రా రైల్వేస్టేషన్లో ఉన్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌లకు నిప్పు పెట్టారు నిరసనకారులు. గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్ హైకోర్టు మొత్తం 31 మందిని దోషులుగా నిర్ధారించగా 65 మందిని నిర్దోషులుగా ప్రకటించింది గుజరాత్ హైకోర్టు. గుజరాత్ హైకోర్టు నిర్ధారించిన తీర్పుపై సుప్రీంకోర్టులో చేసిన అప్పీల్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మీ తండ్రి ఆత్మకు క్షోభ.. ఇదిలా ఉండగా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. నిన్ను చూసి మీ తండ్రి ఆత్మ క్షోభిస్తుందని.. నా బిడ్డకు ఎమైంది? ఎవరి ఆశీస్సులతో నా బిడ్డ రాజకీయంగా ఎదిగాడని అనుకుంటారని.. మీరు చూస్తే ఇండియా కూటమిలో చేరి నానాయాగీ చేస్తున్నారన్నారు. రామ జన్మభూమిపై మీ తండ్రిగారి ఆశీస్సులు ఉంటాయని మీ కూటమికి ఆ శ్రీరామచంద్రుడు కొంతైనా జ్ఞానమివ్వమని ప్రార్ధించమని కోరారు. నోరు విప్పరేం.. ఇక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రేను స్వార్ధపరుడని చెబుతూ తమిళనాడు నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాలా సాహెబ్ ఠాక్రే ఉండి ఉంటే మీ స్వార్ధాన్ని చూసి మనోవేదనకు గురయ్యేవారని వ్యాఖ్యానించారు. #WATCH | On Shiv Sena (UBT) chief Uddhav Thackeray's remarks on Ram Mandir, BJP MP Ravi Shankar Prasad says, "...All I would like to say is that this entire alliance, that is against PM Modi, can go to any limit for votes...I would like to pray to Lord Ram to give them some… https://t.co/Zme5rTQMI6 pic.twitter.com/54bCbNWkhm — ANI (@ANI) September 11, 2023 ఇది కూడా చదవండి: 'భారత్' 'ఇండియా' ఏ పేరైనా పర్వాలేదు -
పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఉపఎన్నిక నుంచి బీజేపీ ఔట్!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. వచ్చే నెలలో జరగనున్న అంధేరీ(తూర్పు) నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాక్రే, షిండే నేతృత్వంలోని బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే.. కీలక ఉప ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు.. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావటం గమనార్హం. పోటీ నుంచి తప్పుకోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనా(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే కోరిన మరుసటి రోజునే ఈ మేరకు ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కులే. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం బీజేపీని తప్పుకోవాలని సూచించారు. అలాగే.. ఉద్ధవ్ థాక్రే వర్గం అభ్యర్థికి మద్దతు తెలపాలని ఎన్ఎన్ఎస్ చీఫ్ కోరారు. నాగ్‌పూర్‌లో చంద్రశేఖర్ బవన్కులే అంధేరీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణించినప్పుడు ఆ స్థానంలో వారి బంధువులపై ఎవరూ పోటీ చేయకూడదనే రాష్ట్ర సంప్రదాయం ప్రకారం తమ అభ్యర్థి ముర్జి పటేల్ తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఉద్ధవ్ థాక్రే వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు మార్గం సుగమమైంది. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించటంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరీ తూర్పు నియోజకవర్గంలో ఆయన భార్య రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Shiv Sena Symbol: గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు -
బీజేపీనే నెం.1.. థాక్రే ఖేల్ ఖతం: ఫడణవీస్
ముంబై: మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదంటే తమదే అని అధికార బీజేపీ-శివసేన, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ప్రకటించుకున్నాయి. మొత్తం 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తాము 259 చోట్ల గెలిచామని బీజేపీ చెబుతోంది. అలాగే తమ మిత్రపక్షం, సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన బలపర్చిన 40 అభ్యర్థులు గెలిచినట్లు పేర్కొంది. ఈ ఫలితాలపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీనే నెంబర్-1 పార్టీ అన్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పని అయిపోయిందన్నారు. బాలాసాబెహ్ థాక్రే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఈ సమయంలో షిండే పక్కనే ఉన్నారు. అయితే మహావికాస్ అఘాడీ మాత్రం బీజేపీ ప్రకటనను తోసిపుచ్చింది. 494 గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు మాత్రమే వచ్చాయని, అందులో తామే ఎక్కువ చోట్ల గెలిచినట్లు లెక్కలు చెప్పింది. వీటి ప్రకారం బీజేపీ 144 స్థానాల్లో, ఎన్సీపీ 126, కాంగ్రెస్ 62, షిండే-శివసేన 41, థాక్రే-శివసేన 37 సీట్లు గెలుపొందింది. దీంతో మొత్తంగా తాము 494కి 225 స్థానాలు గెలిచినట్లు ఎంవీఏ వివరించింది. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు కాబట్టి వీటిని రాజకీయ పార్టీలు తమ విజయంగా చెప్పుకోవడం సరికాదని ఎన్పీపీ నేత అజిత్ పవార్ అన్నారు. ఒకవేళ గెలిచిన అభ్యర్థులు తాము ఈ పార్టీకే మద్దతిస్తామని చెబితే అప్పుడు లెక్కలోకి తీసుకోవచ్చన్నారు. 300 స్థానాల్లో గెలిచామని బీజేపీ-షిండే వర్గం చెబుతోందని ప్రశ్నించగా.. అలా అయితే నేను 400 స్థానాల్లో గెలిచామని చెబుతా అని బదులిచ్చారు. ఇవి పార్టీల గుర్తుపై జరిగే ఎన్నికలు కావు కాబట్టి లెక్కలు ఎంతైనా చెప్పుకోవచ్చని బీజేపీపై సెటైర్లు వేశారు. చదవండి: పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు! -
షిండే ప్రభుత్వ ఏర్పాటు సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్ధవ్ థాక్రే శివసేన వర్గం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండేను ఆహ్వానించడాన్ని పిటిషన్ ద్వారా సవాల్ చేసింది. పదహారు మంది రెబల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంపై ఎటూ తేలకుండానే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించారని, స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లోనూ వారంతా పాల్గొన్నారని కోర్టుకు తెలిపింది. ఉద్ధవ్ థాక్రే వర్గం ప్రతినిధి సుభాష్ దేశాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పదహారు మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత విషయంపై తీర్పు చెప్పాలని థాక్రే వర్గం సుప్రీంకోర్టును కోరింది. వీరు ఓటింగ్‌లో పాల్గొన్న నూతన స్పీకర్ రాహుల్ నర్వేకర్‌పై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పింది. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సీఎం ఏక్నాథ్ షిండే. జూన్ 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీలో సోమవారం జరిగిన బలపరీక్షలో 166 ఓట్లతో షిండే మెజారిటీ నిరూపించుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా 99 ఓట్లే వచ్చాయి. షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక థాక్రే వర్గం మరింత బలహీనపడుతోంది. శివసేన నాయకులు, కార్పొరేటర్లు అధికారికంగా షిండే వర్గంలో చేరుతున్నారు. దీంతో అసలైన శివసేన తమదేనని షిండే వర్గం వాదిస్తోంది. థాక్రేతో ప్యాచప్కు సిద్ధం మరోవైపు ఉద్ధవ్ థాక్రే తిరిగి తమతో కలవాలనుకుంటే పార్టీలో చీలక ఉండదని షిండే వర్గం ఆఫర్ ఇచ్చింది. తమతో పాటు బీజేపీ కూడా ఉందని, మునుపటిలా కలిసిముందుకాసాగుదామని ఆఫర్ ఇచ్చింది. అయితే ఇందుకు థాక్రే బీజేపీ నేతలను కలిసి మాట్లాడాలని సూచించింది. చదవండి: అధికారం పోయింది, మరి పార్టీ? -
Eknath Shinde-బీజేపీ మీరనుకుంటున్నట్టు కాదు: సీఎం షిండే
సాక్షి, ముంబై: బీజేపీ తనకు ఎందుకు మద్దతుగా నిలిచిందో చెప్పారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ఆ పార్టీకి అధికారం మాత్రమే కాదు సిద్ధాంతం కూడా ముఖ్యమనేందుకు తమ ప్రభుత్వమే నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేలు హిందుత్వానికే కట్టుబడి ఉండి తిరుగుబాటు చేయడం వల్లే ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో శివసేన ఎమ్మెల్యేలకు పనులు పూర్తి చేయడానికి కష్టంగా ఉండేదని షిండే పేర్కొన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ మాత్రం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో బలపడాలని చూశాయని ఆరోపించారు. బీజేపీపై ఆ అపోహ నిజం కాదు అధికారం కోసం బీజేపీ ఎమైనా చేస్తుందనే అపోహ ప్రజల్లో ఉందని, కాని అది నిజం కాదని షిండే అన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు హిందుత్వానికి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకే ఆ పార్టీ తమకు మద్దతుగా నిలిచిందని చెప్పారు. హిందుత్వం, అభివృద్ధే తమ ఉమ్మడి ఎజెండా అని, అందుకే బీజేపీకి తమకంటే చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. సీఎం పదవి తనకిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిందని షిండే తెలిపారు. మహారాష్ట్రను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ప్రధాని మోదీ తనకు సూచించారని షిండే ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహకారం ఉంటుందని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారని చెప్పారు. 200 స్థానాల్లో గెలుస్తారా? తాము చట్టవిరుద్ధంగా ఏమీ అధికారాన్ని చేపట్టలేదని షిండే అన్నారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసే పోటీచేశాయని, తాము దానికే కట్టుబడి ఉన్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి 200 స్థానాల్లో గెలుస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటికే తమ కుటమిలో 170 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇంకో 30 స్థానాలే గెలవాల్సి ఉందని చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతో పెద్ద మనసు చేసుకుని తనకు సీఎం పదవి ఇచ్చి, ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారని షిండే అన్నారు. -
మహారాష్ట్ర సీఎంకు ఎంపీ నవనీత్ కౌర్ సవాల్
సాక్షి, ముంబై: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేసి నెగ్గాలని ఆయనకు సవాలు విసిరారు. అమరావతి ఎంపీ అయిన నవనీత్ జైలు నుంచి విడుదలయ్యాక ఆస్పత్రిలో చేరారు. ఆదివారం డిశ్చార్జ్ అయ్యాక విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉద్ధవ్‌ను ఆయనకు నచ్చిన చోటునుంచి పోటీ చేయమనండి. ఆయనపై నేను తలపడతాను. అప్పుడే ప్రజల పవర్ ఏంటో ఆయనకు తెలుస్తుంది’’ అన్నారు. ఉద్ధవ్ చట్టసభలకు ఎన్నికవకుండానే 2019లో సీఎం అయ్యారు. తర్వాత శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. చదవండి: ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న నవనీత్, ఓదార్చిన భర్త రవి రాణా.. వైరల్ వీడియో -
‘ఇలా బెదిరించే సీఎంని ఎక్కడ చూడలేదు’
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే ఏడాది పాలన విఫలమైందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. ఠాక్రే ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేసుల పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించారని కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయని. ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా ఘాటుగా స్పందించిందని ఆయన గుర్తు చేశారు. ‘మేము అర్నాబ్ గోస్వామి, కంగనా రనౌత్‌కు అనుకూలం కాదు. కానీ ప్రభుత్వం వారితో వ్యవహరించిన తీరు మాత్రం దారుణం. ఠాక్రే బెదిరింపులకు దిగుతున్నాడు. ఇంత బెదిరించే ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఆయన మాటలు ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చుతున్నాయి’ అని ఫడ్నవిస్ విమర్శించారు.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆరోపణలతో చేస్తుందని శుక్రవారం ప్రచురించిన శివసేన మౌత్ పీస్ సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం ఠాక్రే తెలిపారు. "మీరు కుటుంబాలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తే, మీకు కుటుంబాలు, పిల్లలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలి. మీ వైఖరిని ఎలా అణిచివేయాలో మాకు తెలుసు" అని ముఖ్యమంత్రి అన్నారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ, ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై వచ్చిన విబేధాల కారణంగా ఈ కూటమి విడిపోయింది. 56 సీట్లు గెలుచుకున్న శివసేన ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
బిగ్‌బాస్: క్షమాపణలు కోరిన జాన్
ముంబై: ప్రముఖ రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్ 14 సీజన్ మొదలై 21 రోజులు గడచింది. హౌజ్ కంటెస్టెంట్ల మధ్య మధ్య ప్రేమ, వివాదాలతో షో మరింత ఆసక్తిగా మారింది. నిన్నటి(బుధవారం) ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్‌తో ప్రారంభమైంది. ఇందులో పవిత్ర పునియా, ఐజాజ్ ఖాన్ మధ్య జరిగిన చిన్న గొడవ, ప్రేమ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కెప్టెన్సీ టాస్క్ ప్రాసెస్‌కు ముందు జాన్ కుమార్ సానును బిగ్‌బాస్ కన్ఫెన్షన్ రూంకు పిలిచారు. ఆ తర్వాత జాన్ కుమార్ తాను మరాఠి భాషపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరాడు. ఎవరీని భాధ పెట్టడం తనకు ఇష్టం లేదని, అవి ఉద్దేశ పూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదన్నాడు. మరాఠీ బాషను అవమానించేలా మాట్లాడిన జాన్ కుమార్ వివాదంలో చిక్కుకున్నాడు. మహారాష్ట ముఖ్యమత్రి ఉద్ధవ్ ఠాక్రే.. జాన్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిగ్‌బాస్ హౌజ్‌కు హెచ్చరిక లేఖ విడుదల చేశారు. భవిష్యత్తులో జాన్ నటించకుండా అతడిపై నిషేధం విధిస్తామని, మరాఠీ బాషను ద్వేషించే వారు ఎవరైన దానికి తగిన ఫలితం చూస్తారని హెచ్చరించారు. హౌజ్ కంటెస్టెంట్ నిక్కీ తంబోలి, సింగర్ రాహుల్ వైద్యతో మరాఠీలో మాట్లాడుతుంది. అక్కడే ఉన్న జాన్ కుమార్ ఆమెను మరోసారి మరాఠీలో మాట్లాడవద్దని, అది తనను చికాకుపెడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం, మరాఠీలు జాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జాన్ కుమార్ మహారాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన వీడియోను రికార్డు చేసి కలర్స్ టీవీ ఛానల్ తన అధికారిక ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది. అంతేగాక భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, జాన్ వ్యాఖ్యలు టెలికాస్ట్ కాకుండా చూస్తామని పేర్కొంది. View this post on Instagram @jaan.kumar.sanu apologies for his remarks in relation to Marathi language made on the Bigg Boss episode aired on Tuesday, 27th October. #BB14 #BiggBoss14 A post shared by Colors TV (@colorstv) on Oct 28, 2020 at 10:50am PDT -
మరాఠిలో లేకుంటే.. ఇంక్రిమెంట్ కట్
ముంబై: మాతృభాష మరాఠికి పెద్దపీట వేయాలని మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయించుకుంది. అన్ని రకాల అధికారిక కార్యకలాపాల్లో మరాఠి వాడుకను తప్పనిసరి చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మరాఠీని ఉపయోగించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. (కరోనా కల్లోలం.. పెరుగుతున్న మరణాలు) ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్‌లో ‘మరాఠిని వాడటంలో విఫలమైన వారి సర్వీస్ బుక్‌లో నెగెటివ్ మార్క్స్ వేస్తాం. వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలిపేస్తాం’ అని వెల్లడించింది. మరాఠి వాడుకను తప్పనిసరి చేస్తూ గతంలో అనేక సర్క్యులర్లను జారీ చేశామని, అయినప్పటికీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం ఆంగ్లాన్నే వాడుతున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. (పెరిగిన వంట గ్యాస్ ధర) ఇంగ్లీషు వాడుక వల్ల సామాన్యులకు, సర్కారుకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోందని మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. అధికారిక ఉత్తర్వుల్లో మరాఠిని ఉపయోగిస్తే, ప్రభుత్వ పథకాలను ప్రజలు బాగా అర్థం చేసుకుని, ప్రయోజనం పొందుతారని తెలిపింది. -
చైనాకు షాక్: 5 వేల కోట్ల డీల్స్ నిలిపివేత
ముంబై: చైనా కంపెనీలకు మహారాష్ట్ర సర్కారు షాకిచ్చింది. దాదాపు 5 వేల కోట్ల రూపాయలు విలువ జేసే ఒప్పందాలను ఉన్నపళంగా నిలిపేసింది. మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సులో చైనీస్ అంబాసిడర్ సున్ వీడాంగ్ తో మహా సర్కారు ఈ నెల 15న మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా యాంటీ చైనా ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో గ్రేట్ వాల్ మోటార్స్, ఫోటాన్, హెంగ్లీ ఇంజనీరింగ్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను పున:పరిశీలించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయించుకుంది.(రైతు వేషంలో మంత్రి: సినిమా సీన్‌ను తలపించేలా..) పుణేలోని తాలేగావ్ లో ఆటో మొబైల్ ప్లాంటును ఏర్పాటు చేయడానికి 3,770 కోట్ల రూపాయలతో గ్రేట్ వాల్ మోటార్స్, మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఎంవోయూ, ఫోటాన్ తో కలిసి పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ స్థాపించాలనుకున్న 1000 కోట్ల రూపాయలు విలువజేసే ప్లాంటు ఒప్పందాన్ని, తాలేగావ్ లో హెంగ్లీ ఇంజనీరింగ్ విస్తరణ కోసం కేటాయించిన 250 కోట్ల రూపాయలు పెట్టుబడులను పక్కన పెట్టింది.(‘ప్రకటనల పట్ల మోదీ జాగ్రత్తగా ఉండాలి’) ఇప్పటికే హరియాణా సర్కారు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న రెండు విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులను స్వచ్ఛందంగా బాయ్ కాట్ చేయాలని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. ‘దేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ బలంగా ఉంది. దేశ ప్రజలంతా అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. అందరూ స్వచ్ఛందంగా చైనా ఉత్పత్తులను సాధ్యమైనంత వరకూ బాయ్ కాట్ చేస్తున్నారు’ అని అన్నారు. -
‘మాది స్వచ్ఛమైన హిందుత్వ’
ముంబై : తన హిందుత్వను రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని తన హిందుత్వ స్వచ్ఛమైన బాలాసాహెబ్ హిందుత్వేనని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. తాను తన జెండాను మార్చలేదని, తమ హిందుత్వ అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. పాక్, బంగ్లాదేశ్‌ల నుంచి అక్రమంగా వలసవచ్చి భారత్‌లో నివసిస్తున్న వారిని స్వదేశాలకు పంపాలని కోరుతూ రాజ్ ఠాక్రేకు చెందిన ఎంఎన్ఎస్ మహా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన కార్యాలయంలో జరిగిన అఖిల పక్ష భేటీలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ కాంగ్రెస్-ఎన్సీపీలతో చేతులు కలిపినంత మాత్రాన శివసేన హిందుత్వ సిద్ధాంతానికి దూరమైనట్టు కాదని వ్యాఖ్యానించారు. తమది ఇప్పటికీ హిందుత్వ సిద్ధాంతంతో ముడిపడిన పార్టీయేనని, అయితే మహారాష్ట్ర అభివృద్ధి ప్రస్తుతం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని చెప్పుకొచ్చారు. ఈ భేటీ అనంతరం మంత్రి ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ మహా వికాస్ అఘడి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, పాలనా పగ్గాలు చేపట్టిన రెండు నెలల్లో రెండు భారీ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రైతులకు ఊరట కల్పించడంతో పాటు రూ 10కే రుచికరమై భోజనం అందచేస్తున్నామని అన్నారు. అక్రమ వలసదారులపై ఎంఎన్ఎస్ ముందకుతెచ్చిన డిమాండ్లు కొత్తేమీ కాదని, దీనిపై ప్రభుత్వం, పోలీసులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. మరోవైపు శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చేతులు కలపడంతో బీజేపీకి దగ్గరై హిందుత్వ పార్టీగా ఎదిగేందుకు ఎంఎన్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చదవండి : ఠాక్రేపై పోస్ట్ : ఇంక్ చల్లిన మహిళ -
మందిర్ వివాదం: బీజేపీకి సేన అల్టిమేటం
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌తో ముందుకు రావాలని, మందిర నిర్మాణ తేదీని ప్రకటించాలని శివసేన శుక్రవారం బీజేపీని డిమాండ్ చేసింది. రామ జన్మభూమిలో బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన శివసైనికులను చూసి పాలకులు గర్వపడాలని బీజేపీని దుయ్యబడుతూ వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో రాముడి పేరిట తాము ఓట్లను అభ్యర్ధించమని సామ్నా సంపాదకీయంలో శివసేన స్పష్టం చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని కోరుతూ నవంబర్ 25న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోధ్యను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. తమకు తాము హిందుత్వ ప్రతినిధులమని చెప్పుకునే వారు తాము అయోధ్య యాత్రను చేపడుతున్నామని ప్రకటిస్తే ఎందుకు కలవరపాటుకు గురవుతున్నారని శివసేన ప్రశ్నించింది. తాము రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడికి వెళ్లడం లేదని సంపాదకీయంలో పేర్కొంది. తమ పార్టీ ‘ఛలో అయోధ్య’ పిలుపు ఇవ్వలేదని, అయితే రాముడి దర్శనం కోసం శివసైనికులు వెళుతున్నారని, అయోధ్య ఏ ఒక్కరి ప్రైవేటు ప్రాంతం కాదని స్పష్టం చేసింది. మందిర నిర్మాణంపై స్పష్టమైన ప్రకటనతో ముందుకు రాకపోతే 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారానికి దూరమవుతుందని, ప్రగల్బాలు పలికిన నేతలు నాలుకలు కోల్పోతారని సామ్నా సంపాదకీయం హెచ్చరించింది. -
ఉద్ధవ్ ఠాక్రే రాయని డైరీ
నెలాఖర్లో అయోధ్య ప్రయాణం. ఏ రోజుకి అక్కడ ఉండాలన్నది నవంబర్ పదిహేడున నిర్ణయించాలి. నాన్నగారు పోయిన రోజది. ‘అయోధ్యకు మేమూ వస్తాం’ అని బయల్దేరారు ఎంపీలు, ఎమ్మెల్యేలు! ‘ఇంతమంది ఎందుకు? రామ మందిరం నిర్మించడానికి వెళుతున్నామా? రాముణ్ణి దర్శించుకోడానికే కదా వెళ్తున్నాం’ అన్నాను. ‘‘ఉద్ధవ్జీ అక్కడ రామ మందిరం లేదు కదా! మందిరమే లేనప్పుడు దర్శించుకోడానికి రాముడు మాత్రం ఎందుకుంటాడు?’’ అన్నాడు సంజయ్‌రౌత్. ఎంపీ అతడు. అయోధ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నది అతడే. టీమ్‌తో వెళ్లి అయోధ్యకు రూట్ మ్యాప్ కూడా వేసుకొచ్చాడు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అయోధ్యకు వెళుతున్నాను. అందుకని అయోధ్య గురించి నాకేమీ తెలియదని అతడు అనుకుంటున్నట్లున్నాడు! ‘‘మదిలో మందిరం ఉన్నప్పుడు అయోధ్యలో మందిరం ఉండాల్సిన అవసరం ఏముంది సంజయ్?! మదిలో లేదు కనుకనే వీళ్లంతా అయోధ్యలోనూ లేదనుకుంటు న్నారు. లేదనుకుంటున్నారు కనుకే అయోధ్యలో మందిరాన్ని నిర్మిస్తాం అంటున్నారు’’ అన్నాను. సంజయ్ మరేమీ ప్రశ్నించలేదు. ఏర్పాట్లలో పడిపోయాడు. అప్పుడప్పుడు నేనిలా తాత్వికంగా మాట్లాడి, మళ్లీ మామూలైపోతానని అతడికి తెలుసు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీని త్వరలోనే నేను కొన్ని కఠినమైన ప్రశ్నలు వేయబోతున్నట్లు దసరా రోజు మహారాష్ట్ర ఓటర్లకు చెప్పాను. ఆ కఠినమైన ప్రశ్నలు అయోధ్యకు వెళ్లినప్పుడు అక్కడ చేసే ర్యాలీలో వెయ్యాలా? లేక, ఈ లోపలే ముంబైలో ఓ ర్యాలీ పెట్టి వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ముంబైలో అయితే రైతుల గురించి ఎక్కువ ప్రశ్నలు వేసి, రాముడి గురించి తక్కువ ప్రశ్నలు వేయాలి. అయోధ్యలో అయితే రాముడి గురించి ఎక్కువ ప్రశ్నలు వేసి, రైతుల గురించి తక్కువ ప్రశ్నలు వేయాలి. నాన్నగారు గుర్తొస్తున్నారు నాకు. ఇలా ఎక్కువ తక్కువల్ని చూసుకునేవారు కాదాయన. అనాలనుకున్నది అనేసేవారు. చెయ్యాలనుకున్నది చేసేసేవారు. పులిలా ఉండేవారు. మోదీలో కూడా పులి పోలికలు ఉన్నాయి కానీ.. పులి పోలికలు ఉన్నవాళ్లంతా నాన్నగారంతటివాళ్లు అయిపోతారా! అమిత్ షా నిన్న ముంబై వచ్చి వెళ్లాడు. వచ్చి వెళుతున్నాడో, ఇక్కడే ఏదైనా లాడ్జిలో ఉంటున్నాడో తెలియడం లేదు. ముంబై దాకా వస్తున్నాడు, ముంబై లోపలికి రావడం లేదు. ముంబై బయటే మోహన్ భాగవత్‌ని కలిసి వెళుతున్నాడు. మందిరం నిర్మాణానికి మంతనాలేవో జరుపుతున్నట్లు ఇద్దరూ కలిసి పిక్చర్ ఇస్తున్నారు. ‘రా’ అని గానీ, ‘మ’ అని గానీ మోదీ ఒక్క ముక్క మాట్లాడ్డం లేదు. అయోధ్యకు వెళ్లి నేను ఆయన్ని కఠినంగా ప్రశ్నించిన తర్వాతి రోజో, అయోధ్యకు వెళ్లి నేను ఆయన్ని ప్రశ్నించడానికి ముందు రోజో మాట్లాడతాడేమో చూడాలి. ఆయన తప్ప ఆయన చుట్టూ ఉండేవాళ్లంతా భక్తితో ఊగిపోతున్నారు. ‘అయోధ్యలో మందిరాన్ని నిర్మించకపోతే ఉద్యమం లేవదీస్తాం’ అంటున్నాడు భయ్యాజీ జోషీ. ప్రభుత్వం వాళ్లది. ఇటుకలు, సిమెంట్ వాళ్లవి. రాముడి విగ్రహం వాళ్లది. ఇక ఉద్యమం ఎవరి మీద! ‘‘కోర్టును అడిగేదేంటి? కోర్టు చెప్పేదేమిటి? కోర్టు వెయ్యేళ్లకు చెబుతుంది. అప్పటివరకు ఆగుదామా?’’ అన్నాడు సంజయ్ మళ్లీ వచ్చి. ‘‘మోదీజీని అడిగేందుకు కొన్ని కఠినమైన ప్రశ్నలు తయారు చెయ్యి సంజయ్’’ అన్నాను సంజయ్ వినడం లేదు. ‘‘కోర్టును అడిగే డిమాలిష్ చేశామా? కోర్టును అడిగి కన్స్ట్రక్ట్ చెయ్యడానికి!’.. ఆవేశంగా అంటున్నాడు. -
థాక్రే చెంపపై కొడితే రూ.2 లక్షలు
చెన్నై: దేశ ప్రజల్లో సహనం నశిస్తోందంటూ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే చెంపమీద కొడితే బహుమతిని ఇస్తామని తమిళనాడు తవ్హీద్ జమాత్ శుక్రవారం ప్రకటించింది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ దేశ ప్రజల్లో సహనం నశిస్తోంది, అభద్రతా భావం పెరిగిపోతోంది, విదేశాలకు వెళ్లిపోవడం మేలని తన భార్య చెబుతోందని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఒకవైపు నిరసన, మరోవైపు హర్షాతిరేకాలు వెలువడ్డాయి. ఆమిర్ ఖాన్‌ను చెంపదెబ్బ కొడితే రూ.లక్ష ఇస్తామని శివసేన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు తమిళనాడు తవ్హీద్ జమాత్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే చెంపపై కొట్టినవారికి రూ.2 లక్షలు బహూకరిస్తామని పేర్కొంటూ జమాత్ సహాయ ప్రధాన కార్యదర్శి తవ్బీక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శివసేన చేస్తున్న ప్రకటనలకు బెదిరిపోమని, మతఛాందసవాదులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. -
'అవేం మాటలు.. నిషేధం విధించండి'
న్యూఢిల్లీ: శివసేన పార్టీపై నిషేధం విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుందని, రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుందని మండిపడింది. శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే భారత్ ను హిందూ రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దేశం లౌకిక దేశం, రాజ్యాంగం కూడా లౌకికమనదే. అది ఎప్పటికీ మార్చలేం. ఉద్దవ్ ఠాక్రే మాటలు మొతతం కూడా దేశ రాజ్యాంగానికి విరుద్ధమైనవి. ఎన్నికల కమిషన్ వెంటనే ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని దానిపై వెంటనే నిషేధం విధించాలి' అని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గురువారం 45 నిమిషాలపాటు చేసిన ప్రసంగంలో ఉద్దవ్ ఠాక్రే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.