ముంబై: చైనా కంపెనీలకు మహారాష్ట్ర సర్కారు షాకిచ్చింది. దాదాపు 5 వేల కోట్ల రూపాయలు విలువ జేసే ఒప్పందాలను ఉన్నపళంగా నిలిపేసింది. మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సులో చైనీస్ అంబాసిడర్ సున్ వీడాంగ్ తో మహా సర్కారు ఈ నెల 15న మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా యాంటీ చైనా ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో గ్రేట్ వాల్ మోటార్స్, ఫోటాన్, హెంగ్లీ ఇంజనీరింగ్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను పున:పరిశీలించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయించుకుంది.(రైతు వేషంలో మంత్రి: సినిమా సీన్‌ను తలపించేలా..)
పుణేలోని తాలేగావ్ లో ఆటో మొబైల్ ప్లాంటును ఏర్పాటు చేయడానికి 3,770 కోట్ల రూపాయలతో గ్రేట్ వాల్ మోటార్స్, మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఎంవోయూ, ఫోటాన్ తో కలిసి పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ స్థాపించాలనుకున్న 1000 కోట్ల రూపాయలు విలువజేసే ప్లాంటు ఒప్పందాన్ని, తాలేగావ్ లో హెంగ్లీ ఇంజనీరింగ్ విస్తరణ కోసం కేటాయించిన 250 కోట్ల రూపాయలు పెట్టుబడులను పక్కన పెట్టింది.(‘ప్రకటనల పట్ల మోదీ జాగ్రత్తగా ఉండాలి’)
ఇప్పటికే హరియాణా సర్కారు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న రెండు విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులను స్వచ్ఛందంగా బాయ్ కాట్ చేయాలని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. ‘దేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ బలంగా ఉంది. దేశ ప్రజలంతా అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. అందరూ స్వచ్ఛందంగా చైనా ఉత్పత్తులను సాధ్యమైనంత వరకూ బాయ్ కాట్ చేస్తున్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment