న్యూఢిల్లీ: శివసేన పార్టీపై నిషేధం విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుందని, రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుందని మండిపడింది. శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే భారత్ ను హిందూ రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దేశం లౌకిక దేశం, రాజ్యాంగం కూడా లౌకికమనదే.
అది ఎప్పటికీ మార్చలేం. ఉద్దవ్ ఠాక్రే మాటలు మొతతం కూడా దేశ రాజ్యాంగానికి విరుద్ధమైనవి. ఎన్నికల కమిషన్ వెంటనే ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని దానిపై వెంటనే నిషేధం విధించాలి' అని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గురువారం 45 నిమిషాలపాటు చేసిన ప్రసంగంలో ఉద్దవ్ ఠాక్రే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
'అవేం మాటలు.. నిషేధం విధించండి'
Published Fri, Oct 23 2015 10:09 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement