ముంబై: ప్రముఖ రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్ 14 సీజన్ మొదలై 21 రోజులు గడచింది. హౌజ్ కంటెస్టెంట్ల మధ్య మధ్య ప్రేమ, వివాదాలతో షో మరింత ఆసక్తిగా మారింది. నిన్నటి(బుధవారం) ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్‌తో ప్రారంభమైంది. ఇందులో పవిత్ర పునియా, ఐజాజ్ ఖాన్ మధ్య జరిగిన చిన్న గొడవ, ప్రేమ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కెప్టెన్సీ టాస్క్ ప్రాసెస్‌కు ముందు జాన్ కుమార్ సానును బిగ్‌బాస్ కన్ఫెన్షన్ రూంకు పిలిచారు. ఆ తర్వాత జాన్ కుమార్ తాను మరాఠి భాషపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరాడు. ఎవరీని భాధ పెట్టడం తనకు ఇష్టం లేదని, అవి ఉద్దేశ పూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదన్నాడు. మరాఠీ బాషను అవమానించేలా మాట్లాడిన జాన్ కుమార్ వివాదంలో చిక్కుకున్నాడు.
మహారాష్ట ముఖ్యమత్రి ఉద్ధవ్ ఠాక్రే.. జాన్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిగ్‌బాస్ హౌజ్‌కు హెచ్చరిక లేఖ విడుదల చేశారు. భవిష్యత్తులో జాన్ నటించకుండా అతడిపై నిషేధం విధిస్తామని, మరాఠీ బాషను ద్వేషించే వారు ఎవరైన దానికి తగిన ఫలితం చూస్తారని హెచ్చరించారు. హౌజ్ కంటెస్టెంట్ నిక్కీ తంబోలి, సింగర్ రాహుల్ వైద్యతో మరాఠీలో మాట్లాడుతుంది. అక్కడే ఉన్న జాన్ కుమార్ ఆమెను మరోసారి మరాఠీలో మాట్లాడవద్దని, అది తనను చికాకుపెడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం, మరాఠీలు జాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జాన్ కుమార్ మహారాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన వీడియోను రికార్డు చేసి కలర్స్ టీవీ ఛానల్ తన అధికారిక ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది. అంతేగాక భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, జాన్ వ్యాఖ్యలు టెలికాస్ట్ కాకుండా చూస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment