కమలం.. సర్వేలే ప్రమాణం | Countless candidates to contest for Lok Sabha | Sakshi
Sakshi News home page

కమలం.. సర్వేలే ప్రమాణం

Feb 21 2024 4:25 AM | Updated on Feb 21 2024 4:25 AM

Countless candidates to contest for Lok Sabha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల లో అభ్యర్థుల ఎంపికకు వివిధ అంశాల ప్రాతిపదికన నిర్వహిస్తున్న సర్వేలనే బీజేపీ జాతీయనాయకత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. రాష్ట్రంలో ని పలు సీట్లకు లెక్కకు మించి అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో సర్వేల్లో వెల్లడయ్యే ప్రజాభిప్రాయం ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక చేపట్టాల ని నిర్ణయించిందని తెలుస్తోంది.

లోక్‌సభ నియోజకవర్గాల్లో పరిస్థితులు, బీజేపీ బలం, వివిధ వర్గాల ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీ పట్ల సానుకూలత, పార్టీబలానికి తోడు అభ్యర్థుల బలాబలాలు తదిత ర అంశాల ప్రాతిపదికగా వివిధ సర్వేలు నిర్వహిస్తున్నారు. కాగా, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి, అమిత్‌షా కనుసన్నల్లో మరో సర్వే సాగుతున్న ట్టు విశ్వసనీయ సమాచారం. సదరు సర్వే ఫలితా లను కేవలం ఆయనకే సమర్పిస్తారని తెలుస్తోంది.  

నెలాఖరుకల్లా సగం మంది అభ్యర్థుల పేర్లు ఖరారు 
వచ్చే నెల మొదటివారం లేదా పదో తేదీలోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడవచ్చుననే అంచనా ల నేపథ్యంలో... ఈ నెలాఖరు కల్లా రాష్ట్రంలోని సగం స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకా శాలున్నాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్‌ నుంచి కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంటూ తాజాగా బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. ఒకవేళ ఆయన అన్నట్టుగానే సిట్టింగ్‌ ఎంపీ లు వస్తే వారి బలాబలాలను కూడా పరిగణనలోకి తీసుకుని కచ్చితంగా గెలిచే అవకాశాలున్న వారికి టికెట్లు కేటాయిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.  

సిట్టింగ్‌ స్థానాలపై స్పష్టత! 
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో.. సిట్టింగ్‌ సీట్లలో సికింద్రాబాద్‌– కిషన్‌రెడ్డి, నిజామాబాద్‌– అర్వింద్‌ ధర్మపురి, కరీంనగర్‌–బండి సంజయ్‌ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా ఆదిలాబాద్‌–సోయం బాపూరావు లేదా మరో అభ్యర్థికి ఇవ్వొచ్చుననే ప్రచారం జరుగుతోంది  

ఆ సీట్ల నుంచి సీనియర్లు 
మల్కాజిగిరి ఎంపీ సీటుకు అత్యధికంగా పది మందికి పైగానే పోటీపడుతున్నారు. వారిలో ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, ఎన్‌.రామచంద్రరా వు, చాడ సురే‹Ùరెడ్డి కూడా ఉన్నారు. ఆ తర్వాత జహీరాబాద్‌ సీటుకు కూడా పోటీ భారీగానే ఉంది.

ఇక్కడి నుంచి ఓ బీసీ నాయకుడిని పోటీకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పోటీ చేయించే అవకాశముందని తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ సీటు విషయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీలో ముందు వరసలో ఉన్నట్టుగా పార్టీనేతలు చెబుతున్నారు. చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డికే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.  

హైదరాబాద్‌కు సైతం పోటీనే 
పెద్దగా గెలిచే అవకాశాలు లేకపోయినా హైదరా బాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా పలువురు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పోటీచేసిన భగవంతరావు, ఇంకా పార్టీలో చేరని మాధవీలత, ఇతర నాయకులు హైదరాబాద్‌ సీటును ఆశిస్తున్నారు.

కాగా, హిందువుల ఓట్లను పోలరైజ్‌ చేసేందుకు గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ను పోటీకి దింపాలనే యోచనలో కూడా నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్, భువనగిరి సీట్లలో పార్టీకి బాగా సానుకూలత ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇక వరంగల్, నల్లగొండ, మెదక్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌ సీట్లలో ఇంకా పార్టీపరంగా మరింత బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈనెల 24 లేదా మార్చి 2న రాష్ట్రానికి అమిత్‌ షా! 
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 24, 25 తేదీల్లో.. లేదంటే మార్చి 2న రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణకు సంబంధించి పార్లమెంట్‌ ఎన్నికల సన్నద్ధతపై అమిత్‌షా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో...పార్టీపరంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్ర పార్టీకి ఆయన ఎన్నికల దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగానే...అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటిస్తార ని చెబుతున్నారు, మెదక్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించడంతోపాటు పార్టీపరంగా నిర్వహిస్తున్న విజయసంకల్ప రథయాత్రల్లో పాల్గొంటారని తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement