4 Covid Vaccines In India: నాలుగు వ్యాక్సిన్లు సిద్ధం: కేంద్రం - Sakshi
Sakshi News home page

corona vaccine: కేంద్రం గుడ్‌న్యూస్‌

Published Tue, Jul 20 2021 4:39 PM | Last Updated on Tue, Jul 20 2021 9:12 PM

COVID-19: 4 vaccines in human trial stage, 1 in preclinical stage: Centre - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల పై కేంద్రం కీలక ప్రకటన  చేసింది. దేశంలో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని  కేంద్రం ప్రకటించింది.  వీటితోపాటు మరో  వ్యాక్సిన్‌  ప్రీ క్లినికల్‌ దశలో ఉందని  వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక  సమాధానంగా  విజ్ఞాన మరియు సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం చెప్పారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి నిమిత్తం కేంద్రం ప్రకటించిన మూడో  ఉద్దీపన ప్యాకేజీ 'ఆత్మనీభర్ భారత్ 3.0' లో భాగంగా 'మిషన్ కోవిడ్ సురక్ష - ఇండియన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ మిషన్' ప్రకటించినట్లు సింగ్ తెలిపారు.

కాడిల్లా హెల్త్‌కేర్ లిమిటెడ్‌ డీఎన్‌ఎ ఆధారిత టీకా మూడోదశ క్లినికల్ పరీక్షల్లో ఉందని, దీని అత్యవసర వినియోగ ఆమోదం కోసంమధ్యంతర డేటాను కూడా సమర్పించిందని తెలిపారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్  టీకా  కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్టు చెప్పారు. అలాగే ముక్కులో వేసే భారత్ బయోటెక్  టీకా కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉందన్నారు.  

ఇంకా  జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌కు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా టీకా ట్రయల్స్‌  మొదటి దశలో  ఉన్నాయన్నారు. గుర్గావ్‌కు చెందిన జెనిక్ లైఫ్ సైన్సెస్ టీకా అడ్వాన్స్‌డ్‌ ప్రీ-క్లినికల్ దశలో ఉన్నాయని సింగ్ తెలిపారు. ప్రస్తుతం సీరం  ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్‌,  భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ , రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ  వ్యాక్సిన్లు దేశంలో పంపిణీకి అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement