న్యూఢిల్లీ: ‘‘ఢిల్లీ మద్యం విధానం పూర్తి పారదర్శకమైనది. గేమ్ చేంజర్. పంజాబ్‌లోనూ అదే విధానాన్ని అమలు చేస్తున్నాం. అక్కడ ఇప్పటికే ఆదాయంలో 50 శాతం పెరుగుదల నమోదైంది. ప్రధాని మోదీకి ఒక్కటే చెప్పదలచుకున్నా. నేనే అవినీతిపరుడినైతే ఇక ప్రపంచంలో ఎవరూ నిజాయతీపరులు కారు’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆదివారం విచారణకు రావాలంటూ ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేయడం తెలిసిందే. దీనిపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విచారణకు హాజరవుతానన్నారు.
‘‘అయితే, మోదీకి రూ.1,000 కోట్లిచ్చానని ఏ ఆధారమూ లేకుండా నేను చెప్తాను. సీబీఐ, ఈడీ ఆయనను కూడా అరెస్టు చేస్తాయా?’’ అని ప్రశ్నించారు. మోదీపై జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా చేసిన తీవ్ర ఆరోపణలను ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఆపాదమస్తకం అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తికి బహుశా అదో పెద్ద విషయంగా కని్పంచకపోవచ్చంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘కేవలం రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు. నన్ను అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు ఆ పార్టీ గనక ఆదేశిస్తే దర్యాప్తు సంస్థలు పాటించి తీరతాయి’’ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘ఏ పార్టీ చేయనంతటి మంచి పనులు ఆప్ చేసి చూపడంతో ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. అందుకే 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరగని స్థాయిలో ఆప్‌ను వేధిస్తున్నారు. నంబర్ 2, నంబర్ 3గా ఉన్న మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను జైలుపాలు చేశారు. ఇప్పుడు నాపై పడ్డారు’’ అని ఆరోపించారు. ‘‘గుజరాత్‌లో బీజేపీ 30 ఏళ్ల పాలనలో స్కూళ్ల పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇటీవల మోదీ అక్కడ ఒక స్కూళ్లో పర్యటించినప్పుడు అధికారులు హడావుడిగా తాత్కాలిక క్లాస్‌రూం ఏర్పాటు చేయాల్సి వచి్చంది. కానీ ఢిల్లీలో మేం ఐదేళ్లలోనే సర్కారీ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దాం’’ అన్నారు.
ఆ 100 కోట్లు ఎక్కడ?
‘‘మేం రూ.100 కోట్ల లంచం తీసుకున్నట్టు ఆరోపించారు? ఆ డబ్బు ఎక్కడుంది?’’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అవకతవకలు జరిగినట్టు ఎలాంటి ఆధారాలూ లేకపోయినా దర్యాప్తు సంస్థలు కోర్టులకు సమరి్పస్తున్న అఫిడవిట్లలో పచ్చి అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. ‘‘నా పేరు, సిసోడియా పేరు చెప్పాలంటూ అరెస్టు చేసిన వారిని హింసిస్తున్నాయి. ఇదీ వారి విచారణ!’’ అంటూ నిప్పులు చెరిగారు. కోర్టులకు తప్పుడు ఆధారాలు సమరి్పస్తున్న సీబీఐ, ఈడీలపై కేసు పెడతానంటూ ట్వీట్ చేశారు. అవినీతిపై మాట్లాడకుండా కేజ్రీవాల్ గొంతు నొక్కేందుకు ఆయన అరెస్టుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందని ఆప్ ఆరోపించింది.
లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా: బీజేపీ
కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తోసిపుచి్చంది. ‘‘సీబీఐ సమన్లతో ఆయన వణికిపోతున్నారు. దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడాలి’’ అని సవాలు విసిరింది.
చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో అసద్ అంత్యక్రియలు.. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ..
Comments
Please login to add a commentAdd a comment