సాక్షి, హైదరాబాద్ : ‘సిద్దిపేట నోట్ల కట్టల లొల్లి’ ఘటనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో రూ.18 లక్షలు లభించాయని కట్టు కథ అల్లారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘనందన్ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు రాగా, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని సూచించారు. ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు.
(చదవండి : కేసీఆర్‌ను బలహీనపరచాలని చూస్తున్నారు)
కాగా, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్టోబర్ 26న రఘునందన్‌రావు సన్నిహితుడు అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని బీజేపీ శ్రేణులు ఆరోపించగా.. ఆ డబ్బంతా రఘునందన్‌రావుదే అని టీఆర్‌ఎస్ ప్రచారం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment