సాక్షి, నెల్లూరు జిల్లా: టీడీపీ నేతల చేతిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత సాకేష్‌ని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ, మంత్రి నారాయణ కనుసన్నల్లోనే సాకేష్‌పై దాడి జరిగిందని.. న్యాయం జరగకపోతే పోరాటం చేస్తామన్నారు.
తీవ్రంగా దాడి చేస్తే.. పోలీసులు చిన్న కేసు పెట్టి వదిలేశారేని.. కొడవలూరు సీఐ కేసును నీరు గార్చారని ఆయన మండిపడ్డారు. సీఐ సురేంద్ర బాబుపై ప్రైవేట్ కేసు వేస్తాం.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడి చేసిన వారిని వదిలిపెట్టం. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అండగా ఉంటాం.. మితిమీరి వ్యవహరిస్తున్న వారిపై భవిష్యత్తులో చర్యలు ఉంటాయి’’ అంటూ కాకాణి హెచ్చరించారు.
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, నాలుగు రోజులు క్రితం సాకేష్ పై గండవరంలో టీడీపీ నేతలు దాడి చేశారని.. అక్రమ కేసులు పెడితే న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. మరణాయుధాలతో దాడి చేశారు.. సాకేష్‌కు పార్టీ తరపున అండగా ఉంటాం.. ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment