సాక్షి, ఆదిలాబాద్: మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్‌రావు కాంగ్రెస్‌ను వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, ప్రేమ్ సాగర్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ప్రేమ్ సాగర్‌రావు కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. మరికొన్ని మండలాల అధ్యక్షులను కూడా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.
చదవండి: KTR: ఇక ఊరుకోం: విపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్
ప్రేమ్‌సాగర్‌రావు డిమాండ్లను తెలంగాణ పీసీసీ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్‌రావు కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు జిల్లా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ఆయన కాంగ్రెస్‌పార్టీని వీడి టీఆర్‌ఎస్, బీజేపీలోచేరాలని చూస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment